ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కైకరంలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహం ఆవిష్కరణ

By

Published : Aug 15, 2020, 3:41 PM IST

సరిహద్దులో వీరమరణం పొందిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు త్యాగానికి ప్రతీకగా.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. కైకరం గ్రామానికి చెందిన.. పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో గ్రామంలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Statue of Colonel Santosh Babu unveiled at Kaikaram
కైకరంలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహం ఆవిష్కరణ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంతోష్​బాబు విగ్రహాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తన సోదరుడు హనుమాన్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. కోనా శ్రీనివాసరావు తన సొంత నిధులతో మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, కాటన్ దొర విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల పక్కనే సంతోష్ బాబు విగ్రహాన్ని ప్రతిష్టించారు. తణుకు మండలంలోని సీఎస్ శిల్ప నిలయంలో... శిల్పి చంద్రశేఖరం సంతోష్ బాబు విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

ABOUT THE AUTHOR

...view details