ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రవాసాంధ్ర తెదేపా అభిమానుల దాతృత్వం

By

Published : Oct 26, 2022, 9:47 PM IST

NRI TDP Donations to victims: తెలుగు దేశం పార్టీకి విదేశాల్లో ఉన్న అభిమానులు స్వదేశంలోని అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తెదేపా అధికారంలో లేకపోయిన కానీ ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకొంటుందని రుజువు చేస్తున్నారు నాయకులు. తాజాగా తమ పార్టీ కార్యకర్తలైన బెజవాడ కృష్ణ, రాధాకృష్ణలకు రూపాయలు 1.75వేల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

ప్రవాసాంద్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు
NRI_TDP_DONATIONS

NRI TDP Donations to victims: ప్రవాసాంధ్రలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొంతమందికి సాయం చేశారు. ఒక దివ్యాంగ యువకునికి, క్యాన్సర్ బాధితురాలికి 1.75 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మాజీ కౌన్సిలర్ బెజవాడ కృష్ణ భార్యకు రూ. 25,000.. విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కోల్పోయిన యువకుడు రాధాకృష్ణకు కృత్రిమ చెయ్యి అమర్చుకోవడానికి రూ.1.50వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సమస్యను మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానుల దృష్టికి తీసుకెళ్లగా... వారు పంపిన ఆర్థిక సహాయాన్ని తణుకులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని వివిధ సంస్థల అనుసంధానంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తణుకు తెలుగుదేశం పార్టీకి ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల వారికి ఆరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details