ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

By

Published : Jun 23, 2021, 8:26 AM IST

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లా సిరివారిగూడెం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 143 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విశ్వనాథ్ బాబు తెలిపారు

http://10.10.50.85//andhra-pradesh/22-June-2021/ap-tpg-67-22-akrama-madyam-pattivetha-av-ap10163_22062021163157_2206f_1624359717_485.jpg
అక్రమ మద్యం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం సిరివారిగూడెం మార్గంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 143 మద్యం సీసాలు పట్టుకున్నట్లు ఎస్సై విశ్వనాథ్ బాబు తెలిపారు. నిందితుడి నుంచి రూ.26,880 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని ద్విచక్ర వాహనాన్ని సీజ్​ చేసినట్లు ఎస్సై వివరించారు. నిందితుడు దర్భగూడేనికి చెందిన జక్కుల రవిని అరెస్టు చేశామని... జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details