ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కురుకుట్టిలో 198 మంది విద్యార్థునులు... ఒకే ఉపాధ్యాయుడు

By

Published : Sep 28, 2019, 6:33 AM IST

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని కురుకుట్టి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ పాఠశాలలో 3,4,5 తరగతుల్లో మొత్తం 198 మంది విద్యార్థునులు చదువుతున్నారు. ఇంత మందికి ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. అందరికీ ఒకేసారి చెప్పలేక... ఇక్కడున్న టీచర్ కష్టపడుతుంటే... సిబ్బంది కొరత కారణంగా విద్యార్థునులు నష్టపోతున్నారు.

198 మంది విద్యార్థునులు... ఒకే ఉపాధ్యాయుడు

198 మంది విద్యార్థునులు... ఒకే ఉపాధ్యాయుడు

ప్రస్తుత పరిస్థితుల్లో... ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువ, విద్యార్థులు తక్కువ ఉంటడం చాలా సందర్భాల్లో చూశాం. కానీ విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టి బాలికల ఆశ్రమ పాఠశాల పరిస్థితి భిన్నంగా ఉంది. 189 మంది విద్యార్థునులుండగా... ఒకేఒక్క ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. ఫలితంగా చిన్నారులను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.

అటు పాఠాలు చెప్పలేక ఉపాధ్యాయుడు... ఇటు చెప్పేవారు లేక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది లేకపోవడం కారణంగా... పాఠశాలలో ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సాలూరు పరిధిలోని చాలా గ్రామాల్లో పిల్లలు లేక స్కూళ్లు మూసివేసే పరిస్థితి ఉంది. అక్కడి ఉపాధ్యాయులను తమ పాఠశాలకు పంపాలని ఆశ్రమ పాఠశాల విద్యార్థునులు కోరుతున్నారు..

ఇదీ చదవండీ... వివేకా హత్యకేసు... మరో మలుపు..!

Intro:AP_RJY_86_27_Nannaya_Univarsity_Jathiya_Mahela_Sadhssu_AVB_AP10023

ETV Bharat :Satyanarayana(RJY CITY)

RAJAMAHENDRAVARAM.

( ) తరతరాల చరిత్రలో తరుణీ తలరాత అనే అంశంపై మహిళ జాతీయ సదస్సును నిర్వహించారు . తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో , సంహిత విద్యాసంస్థల సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ మహిళ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య సురేష్ వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీసి మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లో ఎక్కువమంది మహిళలు విద్యార్థులుగా, సిబ్బందిగా ఉన్నారని అన్నారు. ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న మహిళలు పురుషుల కంటే తాము తక్కువ అనే భావనను కలిగి ఉంటున్నారని అన్నారు. అటువంటి భావనలను నుండి బయటకు వచ్చినప్పుడే నిజమైన మహిళా అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సభను ఏర్పాటు చేస్తున్నామని, దుర్గాబాయి దేశముఖ్ స్థాపించిన ఈ ఆంధ్ర మహిళా సభ కు ఎంతో చరిత్ర ఉందని ఎన్నో కార్యక్రమాలు దీని ద్వారా జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ లోగో ను వీసీ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మహిళలకు నాయకురాలు కు తమ తమ అనుభవాలను అందజేశారు.

byts

ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు --- జక్కంపూడి విజయలక్ష్మి

నన్నయ యూనివర్సిటీ ---- వీసీ ఆచార్య సురేష్ వర్మ



Body:AP_RJY_86_27_Nannaya_Univarsity_Jathiya_Mahela_Sadhssu_AVB_AP10023


Conclusion:AP_RJY_86_27_Nannaya_Univarsity_Jathiya_Mahela_Sadhssu_AVB_AP10023

ABOUT THE AUTHOR

...view details