ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ ఘోర రైలు ప్రమాదం మానవ తప్పిదమే - చర్యలకు రంగం సిద్ధం!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 1:31 PM IST

Human Error in Kantakapalli Train Accident: మానవ తప్పిదం కారణంగానే అక్టోబర్ 29న కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య రైలు ప్రమాదం జరిగినట్టు కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) విచారణను పూర్తి చేసి నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు.

Human_Error_in_Kantakapalli_Train_Accident
Human_Error_in_Kantakapalli_Train_Accident

Human Error in Kantakapalli Train Accident : రాష్ట్రంలో రెండు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఈ రైలు ప్రమాదం సంభవించింది. విశాఖ నుంచి రాయగడ వెళ్లే రాయగడ ప్యాసింజర్​​ రైలును పలాస నుంచి విజయనగరం వైపు వస్తున్న పలాస ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టింది. దీంతోపలాస ప్యాసింజర్‌ ఇంజన్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మూడు రైలు బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ రైలు ప్రమాద సమయంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అక్కడ అంధకారం నెలకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. రైలు పైలట్‌, అసిస్టెంట్‌ పైలట్‌ప్రాణాలు కోల్పోవడంతో ప్రమాదం ఎలా జరిగిందే తెలియలేదు. ఈ విషయంపై అధికారులు విచారణ ముమ్మరం చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. 14 మంది మృతి!.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

Palasa Passenger Train Collided With Raigad Train :తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య అక్టోబరు 29న జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (Commission of Railway Safety) విచారణను పూర్తి చేసి నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా నిర్ధారించి, బాధ్యులైన పలువురు రైల్వే అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు- పట్టాలు తప్పిన గూడ్స్

Vizianagaram Train Crash Reasons :రైలు ప్రమాదం జరిగిన రోజు ఉదయం నుంచి సిగ్నల్‌కు సంబంధించిన పనులు నిర్వహిస్తుండటంతో పరిమితి వేగంతో రైళ్లు నడవాలనే నిబంధన అమలులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణమైన రాయగడ రైలు వేగం గంటకు 92 కిలో మీటర్లుగా నమోదు అయినట్లు తెలిసింది. ఆ రైలు పైలట్‌, అసిస్టెంట్‌ పైలట్‌ ప్రాణాలు కోల్పోవడంతో అంత వేగంగా వెళ్లడానికి గల కారణాలు బయటకు రాలేదు. రైలు ప్రమాదానికి సిగ్నల్‌ అండ్‌ టెలికాం (Signal and Telecom), ఆపరేటింగ్‌ తదితర విభాగాల అధికారులతో పాటు కంటకాపల్లి స్టేషన్‌ అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై వాల్తేర్‌ రైల్వే అధికారులు (Waltair Railway Officials) గోప్యత పాటిస్తున్నారు.

Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై అనేక సందేహాలు.. కారణాలు ఏంటి..?

ABOUT THE AUTHOR

...view details