ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Migrant Workers Dead: కోయంబత్తూరులో కూలిన గోడ.. విజయనగరం వాసులు ముగ్గురు మృతి..

By

Published : Jul 5, 2023, 9:31 AM IST

Migrant Workers Dead in Coimbatore Accident: బతుకుతెరువు కోసం తమిళనాడు రాష్ట్రానికి వలస కూలీలుగా వెళ్లిన వారిని మృత్యువు కబలించింది. కోయంబత్తూరులో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రహరీ కూలి విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు కూలీలు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Etv Bharat
Etv Bharat

Migrant Workers Dead in Coimbatore Accident: కన్నతల్లి లాంటి ఊరిలో మనలేక.. మనుగడ సాగించలేక.. చుట్టుపక్కల బతుకు తెరువు లేక.. బతకలేక.. కూటి కోసం, కూలి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని.. బంధాలు, బాంధవ్యాలను వదులుకుని.. అలసట విశ్రాంతి కోరినా.. అలుపెరగక శ్రమిస్తున్న వేళ.. దయ లేని విధి వారి బతుకులను ఛిద్రం చేసింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రహరీ కూలి విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.

Road Accidents: పాఠశాలకు వెళ్తుండగా బస్సు ప్రమాదాలు.. ఇద్దరు చిన్నారులు మృతి

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రహరీ కూలి బాడంగి మండలం వీరసాగరం గ్రామానికి చెందిన ముగ్గురు వలస కూలీలు మంగళవారం సాయంత్రం మృతి చెందారు. వారిలో కొల్లినక్కేల సత్యం (38), జగన్నాథం (45), రాపాక కన్నయ్య (49) ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరంతా గత 20 ఏళ్లుగా ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే పండగలకు ఇంటికి వచ్చిపోతుంటారు. పిల్లలను కుటుంబ సభ్యుల వద్ద ఉంచారు. కాగా ఈ ప్రమాదంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వీరంతా మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Mother and daughter died: 24 గంటల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి.. తీవ్ర విషాదంలో కుటుంబం

మృతుల వివరాలు..
జగన్నాథం, ఆయన భార్య దాలమ్మ కలిసి పనులకు వెళ్లారు. వీరి కుమార్తె రాముకు రెండేళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు లక్ష్మణ ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలుసుకున్న పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తన చదువు కోసం ఎప్పుడూ డబ్బులు పంపిస్తూ.. ఉన్నత స్థానంలో చూడాలనుకున్న తండ్రి అకాల మరణంతో కుమారుడు లక్ష్మణ కన్నీరుమున్నీరు అవుతున్నాడు.

ఈ ఘటనలో మృతి చెందిన మరో వ్యక్తి కన్నయ్యకు వెంకన్న, తిరుపతి అనే ఇద్దరు కుమారులు, కుమార్తె సత్యవతి ఉన్నారు. అతడి భార్య బోగితో కలిసి ఇద్దరూ కోయంబత్తూరులోనే పనులు చేస్తున్నారు. పిల్లలు నాన్నమ్మ వద్ద గ్రామంలోనే ఉంటూ ఒకరు ఐదు, మరొకరు ఆరో తరగతులు చదువుతున్నారు. రోజూ రాత్రి తమ తండ్రి ఫోన్‌లో మాట్లాడేవారని, మంగళవారం రాత్రి అమ్మ మాత్రమే ఫోన్‌లో ఏడుస్తూ మాట్లాడిందని పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు.

మరో మృతుడు సత్యం ఆయన భార్య సూర ఇద్దరూ కలిసి పనులకు వెళ్లారు. వీరికి గణేష్‌, మణికంఠ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరూ ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు. వీరు గ్రామంలోని తమ నాన్నమ్మ వద్దనే ఉంటున్నారు. ఏడాదికి ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చి ప్రేమగా అక్కున చేర్చుకునే తండ్రి మృతుడిగా ఇంటికి తిరిగి వస్తాడని తెలిసిన కుమారులు గణేష్‌, మణికంఠ రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.

Young Man Died While Swimming Talakona Waterfall: రీల్స్ వీడియో చేస్తూ.. యువకుడు మృత్యువాత!

ABOUT THE AUTHOR

...view details