ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దేశాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన ఏపీ అబ్బాయి.. అమెరికా అమ్మాయి

By

Published : Jun 16, 2022, 6:32 PM IST

రాజాంలో ఆంధ్ర అబ్బాయి, అమెరికా అమ్మాయి వివాహం ఘనంగా జరిగింది. అమెరికా అమ్మాయితో జరిగిన వివాహాన్ని చూసేందుకు పట్టణవాసులు భారీగా తరలివచ్చి.. వధూవరులను ఆశీర్వదించారు.

ఏపీ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
ఏపీ అబ్బాయి.. అమెరికా అమ్మాయి

రాజాంలో ఆంధ్ర అబ్బాయి, అమెరికా అమ్మాయి వివాహం వైభవంగా జరిగింది. రాజాంకు చెందిన కందుల కామరాజు, లక్ష్మీల కుమారుడు కిరణ్‌, అమెరికాలోని డెట్రాయిట్‌ సిటీకి చెందిన మోర్గన్‌ (మహి) అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటిలో చదువుకున్నారు. ఇద్దరూ అక్కడే ఉద్యోగాలు సాధించారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వధువు తల్లిదండ్రులు ఎరిక్‌బ్రింక్‌, టీనాబ్రింక్‌ కోరిక మేరకు అక్కడి సంప్రదాయం ప్రకారం తొలుత పెళ్లి చేసుకున్నారు.

భారతీయ సంస్కృతిని అమితంగా ఇష్టపడే మోర్గన్‌ కోరికతో బుధవారం ఉదయం 7.15 గంటలకు రాజాంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిపించారు. స్నేహితులు, పెద్ద సమక్షంలో ఇక్కడి సంప్రదాయం ప్రకారం వివాహం జరగడం ఆనందంగా ఉందని వధువుతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా అమ్మాయితో జరిగిన వివాహాన్ని చూసేందుకు రాజాం పట్టణవాసులు భారీగా తరలివచ్చి.. వధూవరులను ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details