ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"అర్ధరాత్రి మహిళలను అరెస్టు చేసినప్పుడు మహిళా కమిషన్​ ఎందుకు స్పందించలేదు"

By

Published : Oct 24, 2022, 2:09 PM IST

Janasena Womens: పవన్​ కల్యాణ్​కు రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇవ్వడాన్ని విశాఖ జనసేన మహిళలు తప్పుపట్టారు. విశాఖలో అర్ధరాత్రి మహిళలను అరెస్టు చేసినప్పుడు మహిళా కమిషన్​ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janasena Womens
జనసేన మహిళలు

Janasena Womens: జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు... రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ నోటీసులు ఇవ్వడాన్ని విశాఖలోని జనసేన వీర మహిళలు ఖండించారు. జనసేన ప్రజాముఖంగా అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో అర్ధరాత్రి అని చూడకుండా మహిళలను అరెస్ట్ చేసినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు మాటాడలేదో చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సమయంలో జనవాణి కార్యక్రమం జరగకుండా ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపాకు ధీటుగా జనసేన సిద్ధమవుతోందినే అక్కసుతో అధికార వైకాపా అరెస్టులు, కేసులతో జనసేన నాయకులను భయభ్రాంతులకు చేస్తోందని ఆగ్రహించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రంలో ఎలాంటి దమన కాండ జరుగుతోందో అందరు చూస్తున్నారని... దీనికి చరమ గీతం పాడే రోజు దగ్గరలో ఉందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details