ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారులో తరలిస్తున్న గంజాయి.. కొన్ని గంటలకే మరో కేసు.. కట్​చేస్తే సినిమా సీనే..!

By

Published : Feb 3, 2023, 10:43 PM IST

Ganjai Transporting In Car: కారుతో వేగంగా వెళుతూ ఎక్సైజ్​ కానిస్టేబుల్​ను ఢీ కొట్టి.. స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మళ్లీ అదే ప్రాంతంలోనే మరో గంజాయి కేసు నమోదయ్యింది. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మైనర్​ కూడా ఉన్నాడు. ఈ ఘటనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

Ganjai Transporting In Car
Ganjai Transporting In Car

Three People Caught Carrying Ganjai In Car: ఒడిశా- ఛత్తీస్​గఢ్​ సరిహద్దు రాష్ట్రాల మీదగా భద్రాచలం నుంచి హైదరాబాద్​కు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒక మైనర్​ కూడా ఉన్నాడు. వీరు వేర్వేరుగా కార్లలో హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇల్లందు గంజాయి పట్టివేతలో.. పక్కా సమాచారంతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​​, పోలీసులు ఆధ్వర్యంలో భద్రాచలంలో తనిఖీ చేపట్టారు. ఎక్సైజ్​ అధికారులు అటుగా వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇంతలోనే ఒక కారు .. ఎక్సైజ్​ కానిస్టేబుల్​ అడ్డుకున్న ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఎక్సైజ్​ శాఖ అధికారులు కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి ఎక్సైజ్​ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడవారు అప్రమత్తమయ్యారు. ఇల్లందు మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో కాపు కాశారు. ఇక్కడ కూడా అదే వేగంగా దూసుకొచ్చిన కారు ఎక్సైజ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బాబాను ఢీ కొట్టి.. పట్టణం లోపలికి వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్​కు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కారు పట్టణంలో బీభత్సం సృష్టించింది. చివరకు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఇల్లందు ప్రధాన రహదారి మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. దీంతో కారు అక్కడికక్కడే ఆగిపోయింది. అతివేగంగా వచ్చి గుద్దడంతో విద్యుత్​ స్తంభం విరిగి ఒకవైపు వంగిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఎక్సైజ్​, పోలీస్​ శాఖ అధికారులు.. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 70 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బాక్స్​ గంజాయి సుమారు 5 కేజీలు ఉంటుందని ఎక్సైజ్​ పోలీస్​ అధికారి తెలిపారు. మొత్తం 350 కేజీలుగా లెక్కగట్టారు. వీటి విలువ రూ.21లక్షలుగా ఉంటుందని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి , ఎక్సైజ్​ అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే టేకులపల్లి మండలంలోని ముగ్గురు వ్యక్తులు గంజాయితో టేకులపల్లి పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పాల్వంచ నుంచి టేకులపల్లికి గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వీరి వద్ద నుంచి రూ.30వేలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తడికలపూడి క్రాస్ రోడ్డు వద్ద టేకులపల్లిలోని వ్యక్తికి అందజేసే క్రమంలో.. ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ఇందులో ఒక మైనర్​ బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం అందింది. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు టేకులపల్లి సీఐ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details