ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది: తెదేపా నేతలు

By

Published : Jun 18, 2022, 7:12 PM IST

వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పూర్తి నిర్లక్ష్యానికి గురైంది
వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పూర్తి నిర్లక్ష్యానికి గురైంది ()

వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. ఆ ప్రాంత తెదేపా నేతల మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు 3 రోజుల పర్యటన విజయవంతమైందని తెదేపా సీనియర్‌ నేత కళా వెంకట్రావు అన్నారు. బస్సు యాత్ర పేరుతో వైకాపా చేసిన ప్రయత్నం ఏమైందో అందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు.

ఉత్తరాంధ్రలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన విజయవంతమైందని ఆ ప్రాంత తెదేపా నేతలు వెల్లడించారు. చంద్రబాబు పర్యటనలో 1982 నాటి పరిస్థితి కనిపించిందని తెదేపా నేత కళా వెంకట్రావు అన్నారు. వైకాపా పాలనలో ఉత్తరాంధ్రపై పూర్తి నిర్లక్ష్యం వహించారన్నారు. బస్సు యాత్ర పేరుతో చేసిన ప్రయత్నం ఏమైందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. వేల కోట్లు అప్పులు తెచ్చినా.. కరెంట్‌ కోతలు తప్పటం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మూడేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని మరో నేత బండారు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి బొత్సతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. విశాఖలో నలుగురు బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారని ఆక్షేపించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details