ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh: ''టీచర్లను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టిన జగన్​ను.. ఏం చేయాలి?''

By

Published : Jul 22, 2021, 11:53 AM IST

సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారని విశాఖ జిల్లా ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు.

tdp leader lokesh tweet on teacher suspension
లోకేశ్

సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారని.. విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాల ఉపాధ్యాయుడు ఎస్.నాయుడుని సస్పెండ్ చేయడం ఏంటంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్​ని ఫార్వార్డ్ చేసినందుకే శిక్షిస్తారా అని ప్రశ్నించారు. మరి... విద్యాబుద్ధులు నేర్పే గురువులను త‌న చీప్ లిక్కర్ అమ్మే మ‌ద్యం దుకాణాల ముందు డ్యూటీ పేరుతో నిలబెట్టిన సీఎం జ‌గ‌న్‌ రెడ్డిని ఏం చేయాలని నిలదీశారు.

నడిరోడ్డు మీద ఉరి తీయాలా అని ప్రశ్నించారు. సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయునిపై సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. జగన్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయులను వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఉపాధ్యాయుల స‌మ‌స్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుందని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details