ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఫై సిగ్నల్స్ ఇంట్లోనే సృష్టించొచ్చు.. పదోతరగతి విద్యార్థుల అద్భుతం!

By

Published : Nov 11, 2021, 9:56 AM IST

వారు పదోతరగతి విద్యార్థులే.. అయితేనేం.. వైఫైని ఓ పట్టుపట్టారు. అయస్కాంతం, రెండు బ్లేడ్లు, ఛార్జింగ్‌ వైరుతో వైఫై సిగ్నల్‌ను రప్పించారు. ఇంతకీ వాళ్లు ఎక్కడివాళ్లు ? ఏ విధంగా అది తయారు చేయారు ? తెలుసుకోవాంటే ఇదీ చదవాల్సిందే..!

wifi with magnet
wifi with magnet

అయస్కాంతం, రెండు బ్లేడ్లు, ఛార్జింగ్‌ వైరుతో వైఫై సిగ్నల్‌(WiFi)ను రప్పించారు పదో తరగతి విద్యార్థులు పి.సాత్విక్‌, పి.గణేష్‌, పాతాళం వేణు. విశాఖ జిల్లా(visakha district) చోడవరం మండలం లక్ష్మీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు రామకృష్ణ రెండు రోజుల ముందు విద్యుదయస్కాంత తరంగాలతో అనేక రకాల ప్రయోగాలను చేయవచ్చనే పాఠాన్ని బోధించారు. ఇదే సాత్విక్‌లో ప్రేరణ కలిగించింది. తనకు వచ్చిన ఆలోచనలను ఇతను స్నేహితులు గణేష్‌, వేణులతో పంచుకున్నాడు. ఈ ముగ్గురూ కలిసి పాఠశాలలోనే విద్యుదయస్కాంత తరంగాలతో సెల్‌ఫోన్‌కు వైఫై పనిచేసేలా ప్రయోగం(WiFi work on a cell phone with electromagnetic waves) చేశారు.

రేడియో, టేపు రికార్డుల్లో ఉండే స్పీకర్లకు ఉన్న అయస్కాంతంతో సెల్‌ఫోన్‌ కు వైఫై సిగ్నల్స్ వచ్చేలా తయారు చేశారు. ఛార్జర్‌ అడాప్టర్‌ వైపు ఉన్న ప్లస్‌, మైనస్‌లో తీగలను అయస్కాంతంపై ఉన్న రెండు బ్లేడ్లకు పెట్టిన తర్వాత ఛార్జింగ్‌ను సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తే వెంటనే వైఫై కనెక్ట్‌ అవుతుందని సాత్విక్‌ వెల్లడించాడు.


ఇదీ చదవండి

Share bank: అప్పివ్వలేదని బ్యాంకునే పెట్టారు!

ABOUT THE AUTHOR

...view details