ETV Bharat / city

Share bank: అప్పివ్వలేదని బ్యాంకునే పెట్టారు!

author img

By

Published : Nov 10, 2021, 10:52 AM IST

పొదుపుతో అభివృద్ధికి బాటలు వేద్దామనుకున్నారు.. అందుకు రుణాలకోసం బ్యాంకులపై ఆధారపడకుండా.. సొంతంగా ఓ బ్యాంకునే స్థాపించుకున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన మహిళలు. 23వేలమంది సభ్యులు.. రూ. 19కోట్ల పొదుపుతో జాతీయ బ్యాంకులకే పోటీనిస్తున్న మహిళల సక్సెస్ ఇదీ..

vasundhara
vasundhara

దోతరగతిలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది సౌభాగ్య లక్ష్మి. ఇరవై ఏళ్లు వచ్చే సరికి ముగ్గురు పిల్లల తల్లయ్యింది. కానీ ఓ రోడ్డు ప్రమాదం జీవితాన్ని తల్లకిందులు చేసింది. భర్తని కోల్పోయిన లక్ష్మి ఒంటరిదయ్యింది. అంత చిన్నవయసులో ఆ కష్టం నుంచి తేరుకుని, పిల్లల్ని చదివించుకోవడానికి కారణమయింది షేర్‌మాక్ట్స్‌. ఆ సంస్థలో మోటివేటర్‌గా చేరిన లక్ష్మి జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాదు... తనలాంటి ఒంటరి స్త్రీలకు తోడుగా, వాళ్ల జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది.

విశాఖపట్నంలోని అనకాపల్లి మండలంలో ఉన్న శారదా వ్యాలీ డెవలప్‌మెంట్‌ సమితి సంస్థ... మహిళలు, పేదలు, అసంఘటిత కార్మికుల కోసం పనిచేస్తుండేది. స్త్రీల స్వావలంబనకు పొదుపే మార్గమని నమ్మిన ఆ సంస్థ అధ్యక్షుడు కర్రి జోగినాయుడు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్త్రీలను సంఘటితం చేశారు. ఆయన స్ఫూర్తితో పొదుపుబాట పట్టిన మహిళలు.. గ్రామైక్య, మండల సమాఖ్యలుగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి స్థాపించిందే ‘షేర్‌ బ్యాంక్‌’. అదే ‘ది షేర్‌ మేక్ట్స్‌ లిమిటెడ్‌’గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సహకార చట్టం ద్వారా ఏర్పాటైన తొలి పరస్పర సహకార పొదుపు సంఘం కూడా ఇదే కావడం విశేషం. ఇలా బ్యాంకు స్థాపించాలన్న ఆలోచనకి మరో కారణమూ ఉంది. ఈ ప్రాంతంలో దశాబ్దాల క్రితమే కొందరు మహిళలు పొదుపు సంఘాలని పెట్టుకున్నారు. ఆ డబ్బుని జాతీయ బ్యాంకుల్లో జమ చేసి.. అవసరమైన వాళ్లు రుణాలు తీసుకుని వాయిదాలను క్రమం తప్పక చెల్లించే వారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని తెచ్చింది. దాంతో చాలామంది వాయిదాలని నిర్లక్ష్యం చేశారు. బ్యాంకులు అటువంటి వారిని డిఫాల్టర్లుగా చూపి, వాయిదాలు కడుతున్న వారికీ రుణాలివ్వడంలో జాప్యం చేశాయి. అప్పుడు కొందరు మహిళలకు వచ్చిన ఆలోచనే బ్యాంకు ఏర్పాటు. వాళ్లంతా కలిసి పొదుపు సంఘాలుగా ఏర్పడి షేరు బ్యాంకు స్థాపించారు. అనకాపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ... వాణిజ్య, జాతీయ బ్యాంకులకు దీటుగా అద్భుత ఫలితాలని అందిస్తోంది.

కోట్లలో లావాదేవీలు..
6,126 మందితో ప్రారంభమైన షేర్‌ మేక్ట్స్‌లో ఇప్పుడు 23,525 మంది మహిళలు సభ్యులు. రూ.6 లక్షలతో మొదలైన ఈ పొదుపు ఉద్యమం రూ.19 కోట్లకు చేరుకుంది. రుణాలివ్వడానికి వెనుకాడిన బ్యాంకులే ఈ మహిళల విజయాన్ని గుర్తించి ఆర్థిక సాయం అందిస్తామంటూ ముందుకొస్తున్నాయి. ఎస్‌బీహెచ్‌, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, మరికొన్ని బ్యాంకులు రూ.కోట్లలో షేర్‌ మేక్ట్స్‌కు రుణాలిస్తున్నాయి. వీటితో సభ్యులకు రుణాలివ్వడంతో పాటు రూ.కోట్ల విలువైన స్థిరాస్తులను సమకూర్చుకుందీ బ్యాంకు.

ఆరు నుంచి పది పొదుపు సంఘాలు కలిసి ఒక గ్రామైక్య సంఘంగా ఏర్పడ్డాయి. ఈ సంఘాల నుంచే తొమ్మిది మంది సభ్యులు డైరక్టర్లుగా ఎన్నికవుతారు. వారే బ్యాంకు లావాదేవీలు, నిర్వహణ చూసుకుంటారు. ఈ బ్యాంకులో 30 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. షేర్‌ మేక్ట్స్‌ లాభాలతో మామిడి పాలెంలో నాలుగు ఎకరాలు కొని, అందులో బ్యాంకుకు సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. ఎంపీ నిధులతో మండల స్థాయి శిక్షణా కేంద్రాన్నీ నిర్మించుకున్నారు. సభ్యులకు ఆరోగ్య, సామాజిక సేవలు అందించడానికి మహిళా సలహా కేంద్రాన్నీ ఏర్పాటు చేసుకున్నారు.

- బొద్దల పైడిరాజు, విశాఖపట్నం

భ్యులకు రుణాలతోపాటు జీవనోపాధికి ఉపకరించే యూనిట్ల స్థాపన, నిర్వహణల్లో శిక్షణ కూడా అందిస్తాం. దీని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైపుణ్యాలు ఉండటం వల్ల తీసుకున్న రుణాలు సద్వినియోగమూ అవుతాయి.

- ఎన్‌. మహాలక్ష్మి, డైరెక్టర్‌

పొదుపు, డబ్బు గురించే కాక ఆరోగ్యం, లింగ వివక్ష, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలపైనా కార్యక్రమాలను చేపడుతున్నాం. వీటన్నింటి వల్లా మా సభ్యులు, తద్వారా వారి కుటుంబాలు, సమాజం సమగ్రాభివృద్ధి చెందుతాయన్నది మా ఆలోచన.

- సూర్యకుమారి, ఛైర్‌పర్సన్‌

ఇదీ చదవండి:

CBSE ACCREDATION: సీబీఎస్‌ఈ గుర్తింపునకు 1,092 ప్రభుత్వ పాఠశాలలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.