ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు లేఖతో అధికారులపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం.. పలువురికి షో కాజ్ నోటీసులు

By

Published : Mar 18, 2023, 4:15 PM IST

State Election Commission: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వైకాపా నేత వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు రాసిన లేఖపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల రోజు విధుల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్యాడ్, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్​లకు షో కాజ్ నోటీసులు ఇచ్చినట్లు లేఖలో వెల్లడించింది. అధికారలకు నోటీసులు ఇస్తే సరిపోదని, సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని మరో లేఖలో చంద్రబాబు ఎన్నికల అధికారులను కోరారు.

State Election Commission
చంద్రబాబు

CEO responded to Chandrababu letter: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చినా.. అధికారులు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరించిన తీరుతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారా దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ టీడీపీ, సీపీఐ, బీజేపీ నేతలు బహిరంగాగనే ఆరోపించాయి. కానీ, అధికారులు స్పందించిన తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటుగా, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమ ఓట్లు, అధికార దుర్వినియోగంపై చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆయా అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ రోజు విశాఖలో స్థానికేతరుడైన వైవి సుబ్బారెడ్డి బూత్​ల వద్ద పర్యటనపై ఎన్నికల ప్రధాన అధికారికి మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎన్నికల అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నాడు విధుల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్యాడ్, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్​లకు షో కాజ్ నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రిప్లై లేఖలో తెలిపారు. అధికారులకు నోటీసులు ఇస్తే సరిపోదని, సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని సీఈవో లేఖకు చంద్రబాబు బదులిస్తూ మరో లేఖ రాశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వైకాపా నేత వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు. పోలింగ్ రోజు అక్కయ్యపాలెం ఎన్జీఓఎస్ కాలనీ, జీవీఎంసీ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేసేలా సుబ్బారెడ్డి ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు. స్థానికేతరుడు అయిన సుబ్బారెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ పోలింగ్ బూత్‌ వద్ద నిబంధనలకు విరుద్దంగా తిరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదని లేఖలో ఆరోపించారు. ఘటనపై తాము ఫిర్యాదు చేసే వరకు అధికారులు దీనిపై స్పందించలేదని చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎసీసీ అమలు చేయాల్సిన రిటర్నింగ్ అధికారి, సిటీ పోలీస్ కమిషనర్ తమ విధులను నిర్వర్తించకుండా అధికార వైకాపాకి మొగ్గు చూపారని మండిపడ్డారు.

వైవీ సుబ్బారెడ్డి పర్యటనను ఎన్నికల అధికారులు, పోలీసులు దృవీకరించారని,ఈ కారణంగా వైవీ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని గుర్తుచేశారు. ఇటువంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకపోతే ఇవి నిబంధనలను అపహాస్యం చేస్తాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలో అలసత్వం వహించిన అధికారులతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. తగు చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details