ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం

By

Published : Apr 13, 2021, 10:41 PM IST

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయరు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

police raids on illicit liqour camp
చామంతిపురం సారా కేంద్రాలపై పోలీసులు దాాడి

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం చామంతిపురం సమీపంలోని జీడితోటలో నాటు సారా తయారీ స్థావరాలపై మాకవరపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు రెండు వేల లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు మాకవరపాలెం ఎస్సై రాము తెలిపారు. సారా తయారు చేస్తున్న ముఠా తప్పించుకుందని.. వారి కోసం గాలిస్తున్నామన్నారు. సారా తయరీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details