ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా పరీక్షా కేంద్రాల వద్ద కొరవడుతున్న సదుపాయాలు

By

Published : Jul 31, 2020, 11:28 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రదేశాలలో వచ్చే వ్యర్ధాలను అలానే వదిలేస్తున్నారని.. కనీసం కూర్చునేందుకు కూర్చి కూడా లేదని వచ్చిన వారు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక మీదట ఈ తప్పిదం జరగదని.. పారిశుద్ధ్య సిబ్బందితో పనులు చేయించానని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి తెలిపారు.

vishaka district
కరోనా పరీక్షల వ్యర్ధాలు తొలగించండి..

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పరీక్షలు చేయించుకునే వారు కూడా పెరిగారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆస్పత్రితో పాటు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం వైద్యుల సహకారంతో ప్రతి రోజూ ఏదో ఒక చోట కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు

కానీ సౌకర్యాలు కొరవడడంతో కరోనా పరీక్షలు చేయించుకోడానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించే చోట భౌతిక దూరం పాటించేలా కుర్చీలు కూడా లేవని అంటున్నారు. పరీక్షలు చేయగా వచ్చే వ్యర్ధాలను సైతం అలానే వదిలేస్తున్నారని జీవీఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఇక్కడ కరోనా మరింత ప్రబలే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

చిన్న కమ్యూనికేషన్ గాప్ వల్ల పరిశుభ్రత పనులు చేపట్టలేదని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి వివరణ ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే
తాను పారిశుద్ధ్య సిబ్బందితో పనులు చేయించానని వెల్లడించారు. కరోనా పరీక్షలు నిర్వహించే చోట సదుపాయాలతో పాటుగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇదీ చదవండిసింహాచలం దేవస్థానానికి కొత్త సొబగులు

ABOUT THE AUTHOR

...view details