ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Neonatal: షెడ్డులో నవజాత ఆడశిశువు

By

Published : Oct 10, 2021, 5:26 PM IST

తల్లిదండ్రులే వద్దనుకున్నారో.. ఎవరైనా ఎత్తుకెళ్లి చివరికి వదిలేశారో కానీ.. ఓ శిశువు షెడ్డులో ఏడుస్తూ కనిపించింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. ఘటనాస్థలానకి చేరుకున్న పోలీసులు.. శిశువు వివరాలను సేకరిస్తున్నారు.

New born baby
New born baby

ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ ప్రకృతి లేఅవుట్ వద్ద ఉన్న ఒక షెడ్డులో నవజాత ఆడశిశువు కనిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షెడ్డులో ఉన్న శిశువును గమనించిన పాలమ్మే వ్యక్తి.. స్థానిక వాలంటీర్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన వాలంటీర్.. పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. శిశువు గురించి చుట్టుపక్కల వారిని ప్రశ్నించిన పోలీసులు... ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శిశువు సీడబ్యూసీ సంరక్షణలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details