ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చోడవరంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ర్యాలీ

By

Published : Feb 9, 2020, 5:30 PM IST

మూడు రాజధానులు ముద్దు, ఒక రాజధాని వద్దంటూ వైకాపా అధ్వర్యంలో విశాఖ జిల్లా చోడవరంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తూరు కూడలిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెదేపా నాయకులు పద్ధతి సరిగా లేదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపా నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని వినాయక ఆలయంలో పూజలు చేసినట్లు తెలిపారు.

mla karanam dharma sri
విశాఖ జిల్లా చోడవరంలో వైకాపా ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details