ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిషేధిత మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్న నలుగురిని విశాఖలో అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Jan 24, 2023, 1:32 PM IST

Illegal Drug Injections: ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి నిషేధిత మత్తు ఇంజక్షన్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న ముఠాను విశాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అధికారులు అరెస్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి నాలుగు ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

నిషేధిత మత్తు ఇంజక్షన్ల
Illegal Drug Injections

Illegal Drug Injections: నిషేధిత మత్తు ఇంజక్షన్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న ముఠాను విశాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. సీపీ శ్రీకాంత్, జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో సెబ్ అధికారులు ఈ తరహా విక్రయాలపై నిఘా ఉంచారు. ఎన్ఎస్టీఎల్ గేటు వద్ద ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి దాడులు జరిపారు. విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంకు చెందిన చందు, పెందుర్తికి చెందిన కె.కల్యాన్ సాయి, ఎం. గణేష్, భీమునిపట్నంకు చెందిన కె. హరిపద్మ రాఘవరావులను అరెస్టు చేశారు. వారి నుంచి 94 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దిల్లీకి చెందిన ఆసిమ్, పశ్చిమబెంగాలకు చెందిన అనుపమ్ అనే వ్యక్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి కొనుగోలు చేసిన తర్వాత నిందితులు వాటిని వినియోగించటంతో పాటు యువతకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి నాలుగు ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details