ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళా పోలీసులను సత్కరించిన విశాఖ రేంజ్ డీఐజీ

By

Published : Mar 7, 2021, 7:31 PM IST

మహిళా దినోత్సవం సందర్బంగా.. విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి. రంగారావు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ రేంజ్ పరిధిలోని మహిళా పోలీస్ అధికారులను ఆయన సత్కరించారు.

dig felicitates women police officers at vishakapatnam
మహిళా పోలీసులను సత్కరించిన విశాఖ రేంజ్ డీఐజీ

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి. రంగారావు పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రేంజ్‌ పరిధిలో పని చేస్తున్న మహిళా పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, అదనపు ఎస్పీలు, డీఎస్పీ, ఇన్​స్పెక్టర్లను సత్కరించారు.

మహిళలు తల్లి, చెల్లి, భార్య, కుమార్తె, ఉద్యోగినిగా పలు రకాల పాత్రలు పోషిస్తూ.. విధి నిర్వహణలో సమర్థతను కనబరుస్తూ కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి శ్రమిస్తారన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details