ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Nov 16, 2022, 10:59 AM IST

..

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS

  • నేడు హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం...
    Polavaram Project: నేడు హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరగనుంది. సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి హాజరుకానున్న ఏపీ, తెలంగాణ ఇంజనీర్లు. ఈ సమావేశంలో పీపీఏ కార్యాలయం తరలింపుతో పాటుగా వివిధ అంశాలమీద చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వంద ఎకో టూరిజం ప్రాజెక్టులు: మంత్రి పెద్దిరెడ్డి
    Eco tourism projects: రాష్ట్రవ్యాప్తంగా కనీసం వంద ఎకో టూరిజం ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఏపీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి జూలలో కొత్త జంతువులను తీసుకురావాలని ఆయన సూచించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ అధికారులతో చర్చించి, అనుమతులు తీసుకోవాలని కోరారు. అటవీభూముల ఎన్ఓసీల జారీ రికార్డులు సక్రమంగా ఉండటం లేదని పెద్దిరెడ్డి ఆక్షేపించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జననష్టం జరగకుండా, ట్రెంచ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Earthquakes in Chittoor: చిత్తూరుజిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..Earthquakes in AP: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆవాసాల పేరిట అడవుల ధ్వంసం .. రూ.5 కోట్ల జరిమానా వేసిన ఎన్జీటీ
    NGT imposes 5 crore fine: మడ అడవులను వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేయడంపై.. ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరిట కాకినాడ శివారు దమ్మాలపేటలో మడ అడవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ధ్వంసం చేయడాన్ని, జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుబట్టింది. ప్రభుత్వం చేసిన విధ్వంసానికి.. మధ్యంతర పరిహారం కింద రూ.5 కోట్లు 6 నెలల్లోగా చెల్లించాలని పేర్కొంది. మొత్తం 58 ఎకరాల్లో మడ అడవుల పెంపకం, పరిరక్షణకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుజరాత్​ పీఠం కోసం భాజపా కసరత్తు.. ప్రభుత్వ వ్యతిరేకతను ఆ రెండూ తగ్గిస్తాయా?
    ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణ, హిందుత్వ నినాదాన్ని ఉపయోగించుకుని గుజరాత్‌ ఎన్నికల్లో మరోసారి భాజపా విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. అయితే అధికారంలో ఉండే పార్టీపై వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకతను ఆ రెండింటి ద్వారా అధిగమించాలని ఆ పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశంలో ఉన్న పౌరులంతా హిందువులే'.. RSS చీఫ్​ మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు!
    దేశంలో నివసిస్తున్న పౌరులంతా హిందువులేనని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని స్పష్టంచేశారు. ఎవరూ కూడా తమ ఆచారవ్యవహారాలను మార్చుకోవలసిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ప్రకటన.. మరోసారి రంగంలోకి..
    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్కంఠకు తెరదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు సంచలన ప్రకటన చేసేశారు. రిపబ్లికన్‌ డెమోక్రటిక్‌ పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా ట్రంప్‌ నిలిచారు.అమెరికా పునరాగమనం ఇప్పుడే ప్రారంభమైందని అభిమానుల కోలాహలం మధ్య డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 10 సీట్ల లోపు వాహనాలకూ నేషనల్​ పర్మిట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!
    భారత్​ అంతా పర్యటించేందుకు అనుమతి ఉండేలా వాహనాలకు పర్మిట్‌ జారీకి కొత్త నిబంధనలు తేవాలని నిర్ణయించింది కేంద్ర రహదారి, రవాణాశాఖ. ఈ మేరకు కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఐపీఎల్​ అంటే చాలు విమానాలు ఎక్కేస్తారు.. ఆ మాత్రం దేశం కోసం ఆడలేరా?'
    ఇంగ్లాండ్​ జట్టు ఆల్​రౌండర్ మెయిన్​అలీ వ్యాఖ్యలపై ఆసీస్​ మాజీ కెప్టెన్​ మైఖేల్​ క్లార్క్ విమర్శలు గుప్పించాడు. భారత టీ20 లీగ్ కోసం ఉత్సాహంగా బయలుదేరతారు కానీ దేశం కోసం ఆడలేరా? అంటూ ప్రశ్నించాడు. ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ఇలాంటి ఫిర్యాదులకు ముగింపు పలకాలన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Unstoppable 2: బాలయ్యతో మాజీ సీఎం ముచ్చట్లు.. ఓల్డ్ ఫ్రెండ్స్ కలిస్తే ఆ కిక్కే వేరు!
    నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే'లో బాలయ్య పాత మిత్రుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కిరణ్​ కుమార్​ రెడ్డి సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆహా ఓటీటీ వెల్లడించింది. మరి పాత మిత్రులు మళ్లీ కలుసుకుని ప్రేక్షకులు చూస్తుండగా ముచ్చట్లు పెడితే ఆ కిక్కే వేరు కదూ! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details