ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మురుగునీటిలో ముక్కుపచ్చలారని పసికందు మృతదేహం

By

Published : Nov 16, 2020, 11:02 PM IST

తల్లి పొత్తిళ్లలో ఎదగాల్సిన శిశువు మురుగుకాలువలో తేలియాడింది. కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండానే విగతజీవిగా మారింది. సరిగ్గా శరీర భాగాలు కూడా ఎదగని ఆ పసికందుకు ఎందుకీ శాపం. ఎవరికి కలిగిందో అంత దారుణమైన కోపం. ముక్కుపచ్చలారని శిశువు నిర్జీవంగా మురుగు నీటిలో తేలిన హృదయ విదారకరమైన ఘటన విశాఖ జిల్లా దేవరాపల్లి మండల కేంద్రం బీరక వీధిలో చోటుచేసుకుంది.

a small babe died body
పసికందు మృతదేహం

విశాఖ జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో శరీర భాగాలు సరిగ్గా ఎదగని పసికందు మృతదేహం కలకలం రేపింది. సాయంత్రం వేళ చిన్నారులంతా కలిసి ఆడుకుంటుండగా బంతి మురుగు కాలువలో పడింది. దాన్ని తీసేందుకు వెళ్లిన పిల్లలకు అక్కడ ఏదో వింతగా కనిపించింది.

విషయం అక్కడే ఉన్న పెద్దవారికి తెలియజేయగా.. శిశువు మృతదేహామని వారు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో సీఐ సింహాచలం, ఐసీడీఎస్ పీఓ రమాదేవి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం బయటకు తీసి, పసికందుకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details