ETV Bharat / state

వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అమర్​నాథ్

author img

By

Published : Nov 16, 2020, 7:54 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. తమ పరిశోధనలకు అవసరమైన స్థలాన్ని వైద్య కళాశాలకు తీసుకుంటున్నారని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

anakapalle mla amarnath
anakapalle mla amarnath

anakapalle mla amarnath
శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

విశాఖ జిల్లా అనకాపల్లిలో వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ఆచార్య ఎన్​జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 100 ఎకరాల స్థలంలో 50 ఎకరాలను వైద్య కళాశాలకు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.

వైద్య కళాశాలకు కీలకమైన స్థలాన్ని తీసుకుంటున్నారని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆ స్థలం తమ పరిశోధనలకు అవసరమని వివరించారు. వైద్య కళాశాల వల్ల వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఆటంకం కలగకుండా చూస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల ప్రణాళికను ఆర్డీవో సీతారామారావు, అధికారులు ఎమ్మెల్యేకు చూపించారు.

ఇదీ చదవండి:

పరువు నష్టం దావా కేసుపై తితిదే కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.