ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP Leaders Gravel Mafia in Tirupati: అధికార పార్టీ అండదండలతో ఆగడాలు.. విచ్చలవిడిగా గ్రావెల్‌ అక్రమ రవాణ

By

Published : Aug 12, 2023, 10:11 AM IST

YSRCP Leaders Gravel Mafia in Tirupati: అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. అడ్డగోలుగా గ్రావెల్​ తరలిస్తూ వేల కోట్ల రూపాయల ఆస్థులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలానే లక్ష్యంగా చేసుకుని భారీగా మట్టిని తరలిస్తున్నారు.

YCP_Leaders_Illegal_Excavations
YSRCP_Leaders_Gravel_Mafia_in_Tirupati

YSRCP Leaders Gravel Mafia in Tirupati: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. తమను ఆపే ధైర్యం ఎవరికి లేదని, ఏం జరిగినా పార్టీ పెద్దలు చూసుకుంటారనే కారణం చేత రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి.. సహజ సంపదను నాశనం చేసి కోట్లు దండుకుంటున్నారు. వారి కన్ను పడిందా కొండలు, గుట్టలు సైతం కరిగిపోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా మాఫియాపై ప్రశ్నిస్తే వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అడ్డగోలు మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం స్పందన ఉండదు.

Soil mafia in Mangalagiri: "పర్మిషన్ ఏం లేదండీ..! తవ్వుకోమని ఎమ్మెల్యే చెప్పారండీ"

YCP Leaders Illegal Excavations: తాజాగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండలో అధికార పార్టీ నేతల గ్రావెల్​ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గ్రామంలో విచ్చలవిడిగా గ్రావెల్​ దందా చేస్తున్నారు. ఏమిటని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. తరచూ గ్రామ ప్రజలు అడ్డుకుంటున్న లెక్కచేయడం లేదు. ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో తిరుగుతున్న లారీలను అడ్డుకున్న ఓ యువకుడిపైనే దాడి చేశారు. ప్రజా ప్రతినిధికి చెందిన వారు కావడంతో అధికారులు కూడా అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Illegal Red Clay Excavations: అంతా మా ఇష్టం.. అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు

"ప్రజలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపుతున్న ప్రజాప్రతినిధులు అక్రమంగా గ్రావెల్​ను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో విచ్చలవిడిగా తరలిస్తున్నారు. అడ్డుకున్న వారిపై దాడి చేస్తున్నారు. మా కలవకొండ గ్రామానికి ఏదైనా మేలు చేయాలనే ఆలోచన అధికారులకు ఎవరికైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి గ్రామసభలు నిర్వహించాలి. గ్రామ ప్రజలు ఒప్పుకుంటే ఎమ్మార్వో సమక్షంలో సక్రమంగా తవ్వుకోవాలి కానీ.. ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో లారీల ద్వారా తరలించడాన్ని మా గ్రామస్థులు ఖండిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి ఇలా అక్రమంగా తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు, అధికారులు స్పందించి అక్రమంగా మైనింగ్​ జరగకుండా అడ్డుకోవాలని కోరుకుంటున్నాం."-గ్రామస్థుడు, కలవకొండ

Gravel Mafia Attack on Young Man in Tirupati: చిల్లకూరు మండలంలో తరచూ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. అధికార పార్టీ అండతో సాగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను.. గ్రామస్థులు అడ్డుకున్నారు. తొలుత లారీలను అడ్డుకున్న స్థానిక యువకునిపై గ్రావెల్‌ మాఫియా దాడి చేసింది. సుమారు 4 గంటల పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తవ్వకాలు చేపట్టిన ప్రాంతానికి వెళ్లి లారీలను నిలిపేశారు. భారీ యంత్రాలను ఉపయోగించి అనుమతులు లేని ప్రాంతాల్లో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు ఎమ్మెల్యే అండదండలతోనే గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయని వారు ఆరోపించారు.

Soil Mafia in AP: ఆగని అక్రమ మట్టి తవ్వకాలు.. అంతా మా ఇష్టం అంటున్న అధికార పార్టీ నేతలు

ABOUT THE AUTHOR

...view details