ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RAAVI SHARADHA: రావి శారదకు జానమద్ది హనుమచ్ఛాస్త్రి స్మారక గ్రంథాలయ సేవా పురస్కారం ప్రదానం

By

Published : Jun 21, 2022, 10:25 AM IST

RAAVI SHARADHA

RAAVI SHARADHA: జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారదకు ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్‌శాస్త్రి) స్మారక గ్రంథాలయ సేవా పురస్కారాన్ని ఎస్వీ వర్సిటీ వీసీ రాజారెడ్డి ప్రదానం చేశారు. డిజిటల్‌ గ్రంథాలయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని శ్రీవేంకటేశ్వర వర్సిటీ వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు.

RAAVI SHARADHA:డిజిటల్‌ గ్రంథాలయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని శ్రీవేంకటేశ్వర వర్సిటీ వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. ఎస్వీయూలోని గ్రంథాలయంలో సోమవారం పౌర గ్రంథాలయ వ్యవస్థపై రాయలసీమ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారదకు ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్‌శాస్త్రి) స్మారక గ్రంథాలయ సేవా పురస్కారాన్ని వీసీ రాజారెడ్డి ప్రదానం చేశారు. అనంతరం రావి శారద మాట్లాడుతూ ప్రపంచ విజేతలందరిలోనూ గ్రంథాలయం భాగమైందన్న విషయాన్ని నేటితరం యువత గుర్తెరిగి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 5 దశాబ్దాలకు పైగా ఎస్వీయూ గ్రంథాలయానికి సేవలందించిన షణ్ముగంను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షుడు శేషగిరిరావు, నిర్వాహకులు ఆచార్య సురేంద్రబాబు, డాక్టర్‌ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details