ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజకీయ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. న్యాయం చేయండి: ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు

By

Published : Mar 9, 2023, 10:15 PM IST

Updated : Mar 9, 2023, 10:25 PM IST

Please do us justice Srikakulam Electrical Contractors: వృత్తిపరంగా రోజురోజుకు రాజకీయ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని.. ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులు గానీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని.. శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రికల్ లైసెన్సుడ్ కాంట్రాక్టర్లు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ తమను పదేపదే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ దైవప్రసాద్‌‌కి వినతిపత్రాన్ని అందజేశారు.

political issue
political issue

Please do us justice Srikakulam Electrical Contractors: రోజురోజుకు రాజకీయ నాయకుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని.. ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులు గానీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని.. శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రికల్ లైసెన్సుడ్ కాంట్రాక్టర్లు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ తమను పదేపదే వేధింపులకు గురి చేస్తున్నారని.. యూనియన్ అధ్యక్షుడు పాపారావు ఆరోపించారు. ధర్మాన కృష్ణదాస్ పీఏపై వెంటనే చర్యలు తీసుకొని.. తమకు, తమ ఉద్యోగాలకు అండగా నిలవాలని కోరుతూ.. నేడు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ దైవప్రసాద్‌కి వినతిపత్రాన్ని అందజేశామన్నారు.

ఈ సందర్భంగా నరసన్నపేట సబ్ డివిజన్ కాంట్రాక్టర్ గొద్దు చిరంజీవులు మాట్లాడుతూ.. ''గత 20 సంవత్సరాలుగా నేను ఎలక్ట్రికల్ పని చేస్తున్నాను. నా వద్ద మరో 30మంది పని చేస్తున్నారు. గత ఆరు నెలల నుంచి మాజీమంత్రి కృష్ణదాస్ పీఏ మురళీ మమ్మల్ని రాజకీయంగా పదేపదే వేధిస్తున్నారు. నా వద్ద పనిచేస్తున్న వారిని తొలగించి, అతను చెప్పినవారికి పని కల్పించాలంటూ డీఈకి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి, ఎస్‌ఈలకి ఫోన్లు చేసి నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని కృష్ణదాస్‌కి తెలియజెప్పడానికి రెండుసార్లు ప్రయత్నించాము. కానీ, ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయాము. ఈరోజు మా సమస్యను వినతిపత్రం రూపంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ దైవప్రసాద్ అందించాము.

మాజీమంత్రి కృష్ణదాస్ గారి వద్ద పీఏగా ఉంటున్న మురళీ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈని వేడుకున్నాము. పనిలో ఎలాంటి అనుభవం లేనివారిని తీసుకొచ్చి రాజకీయంగా నన్ను, నా వద్ద పని చేస్తున్నవారిని భయపెడుతున్నారు. ఇప్పటికీ జలమూరు విషయంలో నలుగురు కొత్త వ్యక్తులను పనిలో పెట్టించి, కాంట్రాక్ట్‌లు ఇవ్వకుండా చేశారు. ఇది ఇలాగే కొనసాగితే, ఇన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ పనినే నమ్ముకుని బ్రతుకుతున్న మేము, మా కుటుంబాలు రోడ్డునపడే అవకాశం ఉంది. అవసరమైతే ఈ విషయంలో మేమంతా ధర్నాకు దిగుతాం. ఈ విషయంలో ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులు గానీ స్పందించి..మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాము'' అని తెలిపారు.

రాజకీయ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం

పీఏ మురళీ బెదిరింపుల వల్ల ఇప్పటికే రెండుసార్లు తమకు అన్యాయం జరిగిందని.. ఎలక్ట్రికల్ లైసెన్సు కాంట్రాక్టర్లు జిల్లా అధ్యక్షుడు పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు. జలమూరు సెక్షన్‌లో ఎటువంటి పని అనుభవం లేనివారికి అగ్రిమెంట్లు ఇచ్చారని.. ఈ విషయంపై ఏఈతో మాట్లాడిన కూడా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమకు ఏ రాజకీయ పార్టీతో గానీ, నాయకులతో గానీ సంబంధం లేదని, ఈ విషయంలో ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి పీఏ మురళీ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 9, 2023, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details