ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Palasa Temple: దర్శనం తీరుపై భక్తుడి అలక.. పలాసలో తిరుమల ఆలయం

By

Published : Jul 6, 2023, 10:35 PM IST

Tirumala Model Temple in palasa: శ్రీకాకుళం జిల్లా పలాసలో సుమారు 12 ఎకరాల్లో.. ఐదేళ్ల కిందట చేపట్టిన వేంకటేశ్వరాలయ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఒడిశా రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి.. తిరుపతిలో శ్రీవారి దర్శనంలో తనకు ఎదురైన ఇబ్బందులు మరే ఇతర భక్తునికి కలగొద్దనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..!

Etv Bharat
Etv Bharat

పలాసలో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం

Tirumala Model Temple in palasa: చిన్నపిల్లలు అన్నం తినడానికి మారం చేస్తుంటే "చందమామ రావే.." అంటూ ఆ జాబిలిని పిలుస్తూ అమ్మ అన్నం తినిపిస్తుంది.. చందమామని రప్పించడం జరగని పని అని తెలిసినా.. పిల్లల కోసం తల్లి అబద్ధాలు చెప్తుంది. కానీ అలాంటి అసాధ్యాన్ని ఓ తల్లి సాధ్యం చేసి చూపిస్తోంది. పలాసకు చెందిన 95 ఏళ్ల హరి ముకుందపండా పదేళ్ల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాడు. స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగలేదని తిరిగి వచ్చి తన తల్లికి చెప్పగా దైవం ఎక్కడైనా ఒక్కటే అంటూ తిరుమల లాంటి గుడి మన ఊర్లోనే కట్టుకోమని చెప్పింది, ప్రస్తుతం పలాస పట్టణం నడిబొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల దేవస్థానం లాంటి ఆలయ నిర్మాణం జరుగుతోంది ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఆలయ నిర్మాణం పనులు ఐదారు నెలల్లో పూర్తవుతున్న నేపథ్యంలో ఆ క్షేత్రం విశేషాలివీ..

రాజ కుటుంబీకుల ఆధ్వర్యంలో... ఒడిశా రాజ కుటుంబానికి చెందిన హరి విష్ణు ప్రియ పండాని అమ్మ వయస్సు దాదాపు 110 ఏళ్లకు పైనే ఉంటుంది నిత్యం అమ్మవారి ఉపాసన చేస్తూ తమ ఇంటికి వచ్చిన ఎంతోమందికి గుప్తంగా దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరితో కూడా మాట్లాడారు. నిత్యం దైవ ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఆమెకు ఒక్కగాన ఒక కుమారుడైన హరి ముకుందా పండా పదేళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాడు.చాలా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు దర్శనంచేసుకునేటప్పుడు ఆయనని అధికారులు పక్కకు తోసేయడంతో చాలా బాధపడ్డారు. ఆయనతోపాటు సాధారణ భక్తుల పరిస్థితి అలానే ఉందని గ్రహించిన ఆయన.. తిరిగి వచ్చి తన తల్లికి ఈ విషయాన్ని తెలిపారు. తన కుమారుడితో పాటు ఎంతోమంది పరిస్థితిని గమనించిన ఆ తల్లి.. తనకున్న కొబ్బరి తోటలోనే 12 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టమని చెప్పింది. దాంతో హరి ముకుంద ఐదేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. 95 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా పగలనక, రాత్రనకా ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా.. కొన్ని కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఏ ఇంజినీర్ సహాయం కూడా తీసుకోలేదు. తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి, ఏ విగ్రహం పెట్టాలి, శిల్పాలు ఏ విధంగా ఉండాలి..? అనేవి తల్లి ఆదేశం ప్రకారం ముకుంద కార్యనిర్వాహణ చేస్తున్నారు.

త్వరలో విగ్రహ ప్రతిష్ఠాపన... ఆలయ నిర్మాణం మహాద్భుతంగా కొనసాగుతోంది 5, 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని హరి ముకుందా పండా తెలిపారు ఆలయంలో శిల్పకళ కు ప్రాధాన్యమిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్, రాజస్థాన్ నుంచి అనేక ఏకశిలా విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించనున్నారు. శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీనివాస ఆలయంతో పాటు శివాలయం, దశావతారాలు, గరుత్మంతుడు, ఆంజనేయ విగ్రహాలు, ఆలయంలోపల గోడలపై అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో పాటు కొలనులు, కళ్యాణ మండపాలతో అద్భుతంగా ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయం లోపల ప్రశాంతమైన వాతావరణంతో పాటు చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలే ఉన్నాయి. శ్రీనివాస స్వామి వారి మూలవిరాట్ అచ్చం తిరుమలలో పోలిన విధంగా చేపట్టారు. వినాయకుడు, సరస్వతీ దేవి అనంత పద్మనాభ స్వామి అష్టావతారాలు వేంకటేశ్వర స్వామి మహత్మ్యం లాంటి పురాణాలు చూడొచ్చు, భక్తుల కోసం కొలనులు, మరుగుదొడ్లు, స్నాన్న గదులు.. వివాహాలకు కళ్యాణ మండపాలు నిర్మించారు.

ఒంటిపూట భోజనంతో... 95 ఏళ్ల వయసులోనూ హరి ముకుంద పండా ఉదయం మూడు గంటలకు లేచి హోమయోగ కసరత్తులు చేస్తారు. తల్లి హరివిష్ణు ప్రియ సేవ చేసి ఎనిమిది గంటలకు ఆలయానికి వచ్చి రాత్రి నిద్రపోయే వరకు ఆలయం నిర్మాణంలో నిమగ్నులవుతారు, ప్రతిరోజు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయడంతో పాటు యోగ సాధన దైవ ధ్యానం దిన చర్యలో భాగంగా చేసుకున్నారు, హరి ముకుందా పన్నెండేళ్ల వయసులోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు, హరి ముకుందాకు ఒక కుమారుడు ఉన్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన... తన తండ్రి తర్వాత ఆలయ బాధ్యతలు చూసుకుంటారని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details