Tirumala Srivari Hundi Fell Down: తిరుమల ఆలయంలో అపశృతి.. కిందపడిన శ్రీవారి హుండీ..

By

Published : Jul 6, 2023, 2:04 PM IST

Updated : Jul 6, 2023, 2:15 PM IST

thumbnail

Tirumala Srivari Hundi Fell Down: తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామివారి హుండీని ట్రాలీని తోసుకుంటూ వస్తుండగా పొరపాటున కిందకు పడిపోయింది. ఆలయం నుంచి రోజువారీగా హుండీలు పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కాసేపు మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను అధికారులు నిలిపివేశారు. హుండీలో నుంచి కిందకు పడిపోయిన కానుకులను టీటీడీ అధికారులు తిరిగి హుండీలోకి వేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ మహాద్వారం వద్ద ట్రాలీని తోసుకుని వస్తుండగా గట్టుకు తగులుకుందని, దానిని సిబ్బంది నియంత్రించలేకపోవటం వల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. కాగా తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఆలయ అధికారులు 18 గంటల అనుమతినిచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకునేందుకు 77,299 మంది భక్తులు తరలివచ్చారు. వారిలో 30,479 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు.

Last Updated : Jul 6, 2023, 2:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.