Man Arrested in Tirumala: తిరుమల కొండపై వ్యక్తి హల్​చల్.. ఎందుకంటే..!

By

Published : Jul 5, 2023, 10:09 PM IST

thumbnail

Man Hulchul at Tirumala Hill: వారంతా కుటుంబంతో తిరుమలకు వచ్చారు. దైవ దర్శనం కోసం చాలా సమయం ఎదురు చూశారు. ఎట్టకేలకూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో వారితో వచ్చిన ఓ వ్యక్తి తనకు సిగరెట్ కావాలంటూ భీష్మించుకు కూర్చున్నాడు. వారంతా ఆ వ్యక్తికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.  తిరుమల కొండ ప్రాంతంలో ధూమపానం, మద్యపానం నిషేదమని.. కిందకు దిగిన తరువాత కొనిపెడతామని బతిమిలాడారు. అయినా వినిపించుకోని ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేస్తానంటూ హల్​చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల విజిలెన్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రీవారికి దర్శనానికి వచ్చిన మెదక్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి  గత రెండు రోజులుగా తనకు సిగరెట్ లేకపోవడంతో మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో గోగర్భం జలాశయం వద్దకు చేరుకున్న నరేంద్ర.. ధూమపానం ఇవ్వకపోతే దూకి చనిపోతానని బంధు వర్గాన్ని బెదిరించాడు. అటువైపు వెళుతున్న పాపవినాశనం దుకాణదారులు తితిదే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అధికారుల సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా నరేంద్ర వినిపించుకోకపోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.