ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడు దోపిడీలు.. ఆరు కబ్జాలతో జగన్ రెడ్డి పాలన: అచ్చెన్నాయుడు

By

Published : Dec 23, 2022, 2:57 PM IST

Atchannaidu Comments on YCP: జగన్ రెడ్డి పాలన మూడు దోపిడీలు, ఆరు కబ్జాలు అన్నట్టు సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఇలాఖాలో రైతులసాగులో ఉన్న భూములు దేవాదాయశాఖ జాబితాలోకి ఎలా చేరాయని ప్రశ్నించారు.

Atchannaidu
అచ్చెన్నాయుడు

Atchannaidu Comments on YCP: భూకబ్జాల్లో మునిగి తేలుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మూడు దోపిడీలు, ఆరు కబ్జాలు అన్నట్టు జగన్ రెడ్డి పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఇలాఖాలో దశాబ్దాల నుంచి రైతుల సాగులో ఉన్న భూములు.. దేవాదాయశాఖ భూముల జాబితాలోకి ఎలా చేరాయని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాకముందే రైత్వారీ పట్టాలు, ఆర్ఎస్ఆర్, ఇనాం-బీ రిజిస్టర్లలో రైతుల పేర్లతోనే భూములున్న విషయం అధికారులకు తెలియదా అని అన్నారు.

స్థానిక వైసీపీ నేతలు.. కొందరు అధికారులతో కుమ్మక్కై భూముల కబ్జాకు కుట్ర పన్నారని రైతులు చెబుతున్నారన్నారు. దశాబ్దాల నుంచి భూముల సాగుతో కుటుంబాలను పోషించుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details