ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీతాలు ఇవ్వడం లేదని.. గ్రామీణ నీటి సరఫరా ఉద్యోగుల ధర్నా

By

Published : Jan 20, 2023, 4:39 PM IST

Rural Water Supply Department Employees: ఉద్దానం మంచి నీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న సుమారు 109 మంది కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని గ్రామీణ నీటి సరఫరా విభాగ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన చేపట్టారు.

Etv Bharat
Etv Bharat

Rural Water Supply Department Employees: ఉద్దానం మంచి నీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న సుమారు 109 మంది కార్మికులకు 33 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గ్రామీణ నీటి సరఫరా విభాగ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మకరజోల ఉద్దానం ప్రాజెక్ట్ ప్రధాన పంప్ హౌస్ వద్ద ధర్నా చేశారు. తక్షణమే జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న కనీస వేతనాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగ ఉద్యోగులు ధర్నా

"ఉద్దానం మంచి నీటి ప్రాజెక్టులో పనిచేస్తున్న 109 మంది కార్మికులకు 33 నెలల నుండి జీతాలు లేకుండా ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోంది. ఇది సరైన చర్య కాదు. వెంటనే వాళ్ల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు, సంఘీభావం ప్రకటిస్తున్నాం. అదేకాకుండా కేంద్ర గవర్నమెంటే ఓ కమిటి వేస్తే.. కనీస వేతనం 26 వేల రూపాయలు ఉండాలని చెప్పింది. ఆ 26 వేల రూపాయలు కార్మికులకు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం." - గ్రామీణ నీటి సరఫరా విభాగ ఉద్యోగి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details