ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rain In Srikakulam: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం.. ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు

By

Published : May 17, 2023, 10:27 AM IST

Rain In Vizianagaram: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతుంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షబీభత్సానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇచ్చాపురం కవిటి మండలాల్లో భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. విజయనగరంలో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది.

Rain with gusty winds in Srikakulam
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం

Rain In Srikakulam And Vizianagaram Districts: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతుంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షబీభత్సానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో ఈదురు గాలులు, వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు, పూరి గుడిసెలు నేలకూలాయి. విజయనగరంలో భారీ వర్షానికి చెట్లు కూలి వాటి కింద నిలిపిఉంచిన కార్లు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.

రెండు మండలాల్లో చిమ్మ చీకటి : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కవిటి మండలాల్లో భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఒకసారిగా కారు మబ్బులుతో కూడిన ఉరుములు మెరుపులతో దదిరిల్లి భయ బ్రాంతులకు గురి చేసింది. రెండు మండలాల్లో చిమ్మ చీకటితో అలమ కొన్నాయి . అనంతరం వర్షంతో పాటు వీచిన ఈదురు గాలులకు పలు ప్రాంతాలలో చెట్లు తోపాటు చెట్ల కొమ్మలు పూరి గుడిసెలు నెలకొరిగాయి. ఇనుప రేకు గాలికి ఎగిరి ఇచ్చాపురానికి చెందిన పాండవ మోహిని తలకు తహలడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఇచ్చాపురం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ గురు ప్రసాద్ ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇచ్చాపురం జాతీయ రహదారి బెల్లుపడ కోడలు వద్ద సంబరాలకు ఏర్పాటు చేసిన భారీ గేటు నేలకొరడంతో విద్యుత్తు అంతరాయంతో పాటు రాకపోకలు స్తంభించాయి.

నేలకొరిగిన చెట్లు, హోర్డింగ్​లు :విజయనగరంలో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది. అయితే., భారీ ఈదురు గాలులు కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్​లు నేలకూలాయి. పలు చోట్లు వృక్షాలు కూలడంతో వాటి కింద్ పార్కింగ్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఉడా కాలనీ, ఆర్టీసీ కాలనీ, గజపతినగరం, డెంకాడ రహదారి, నాయుడు కాలనీ, అయ్యన్నపేట తదితర ప్రాంతాల్లో అధికంగా వృక్షాలు నేలకూలాయి. పోలీసు మైదానం ప్రక్కన రాష్ట్ర రహదారిపై చెట్లు కూలటంతో వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. వెంటనే నగర పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. అదే విధంగా ఎక్కడికి అక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు సిబ్బందితో తొలగించే ప్రక్రియ చేపట్టారు. విజయనగరంలో పలుచోట్ల వృక్షాలు, హోర్డింగ్​లు పడిపోవటంతో నగరంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details