ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పింఛన్​ అందక.. కడుపు నిండక.. వృద్ధుడు మృతి

By

Published : Feb 10, 2023, 4:11 PM IST

Updated : Feb 10, 2023, 5:36 PM IST

Oldman Died due to Pension Cut : ప్రభుత్వం అందించే పింఛన్​ నగదు అతనికి ఆసరాగా ఉండేది. నెలకు అందాల్సిన పింఛన్​ అందితే అతనికి నెల మొత్తానికి తోడుగా ఉండేది. ఏడు పదులు నిండిన ఆ వృద్ధుడికి వెనక ముందు ఎవరూ లేకపోవటంతో.. పింఛన్​పై ఆధారపడి జీవించే వాడు. కానీ, చివరికి..

Etv Bharat
Etv Bharat

Oldman Died due to Pension Cut: ప్రభుత్వం ఇచ్చే పింఛన్​పై అనేకమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నెలనెలా వచ్చే పెన్షన్​ కోసం వృద్ధులు, ఏ ఆధారం లేనివాళ్లు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అసలే అయినవాళ్లు లేక.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండే వాళ్లకు ఈ పింఛనే ఆధారం. కానీ ప్రభుత్వ నిబంధనలతో ఎంతోమంది పింఛన్లకు దూరమవుతున్నారు. ఇన్నాళ్లు ఇచ్చిన పెన్షన్లను నిలిపివేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి.. అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేదు. వృద్ధాప్యంలో ఇక తిరిగే ఓపిక లేక ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిలాలో జరిగింది.

అధికారుల నిర్లక్ష్యానికి.. గిరిజన వృద్ధుడి ప్రాణం బలి

శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్ధునికి పింఛన్​ అందక ఆకలితో అలమటిస్తూ తనువు చాలించాడు. పలు సాంకేతిక సమస్యలతో పింఛన్​ ఆగిపోవటంతో.. వృద్ధునికి అందాల్సిన పింఛన్​ అందలేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించారు. ఎవరూ లేని ఒంటరివాడని వివరించినా పట్టనట్లు వ్యవహరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం మామిడిగుడ్డి గ్రామానికి చెందిన సవర బారి ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. వెనకముందు ఎవరూ లేకపోవటంతో బంధువు కైలాష్​ అప్పుడప్పుడు వచ్చి బాగోగులు చూసేవాడు.

సవర బారికి కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లెేదు. ఇతనికి ప్రభుత్వం నుంచే పింఛన్​పై ఆధారపడి జీవించేవాడు. వచ్చిన కొద్ది మొత్తంతో జీవనాన్ని కొనసాగించాడు. గత కొంతకాలంగా ఇతనికి అందాల్సిన పింఛన్​ ఆగిపోయింది. కనీసం తినటానికి తిండి దొరకని పరిస్థితి వచ్చింది. దీంతో స్థానికులు ఇతనికి ప్రతిరోజు భోజనం అందించేవారు. విషయం తెలుసుకున్న బంధువు కైలాష్​ పలుమార్లు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఒంటరిగా ఉన్న వృద్ధునికి పింఛన్​ అందించాలని కోరినప్పటికీ ఎటువంటి ఫలితం దక్కలేదు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమస్యను వివరించినా ఫలితం మాత్రం శూన్యం. డివిజన్​ స్థాయిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో.. టెక్కలి సబ్ కలెక్టర్​కు సమస్యను తెలియజేశాడు. అప్పటికే వృద్ధుడి ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న ఉద్దానం సేవా సమితి వైద్య సేవలు అందించింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో ఆ వృద్ధుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఓ వృద్ధుడు ఆకలితో అలమటించి చనిపోవడం సిగ్గుచేటు. అధికారులు దయ తలిచి ఉంటే ఓ ప్రాణం ఇంకా కొన్నాళ్లైనా నిలిచివుండేది.

స్పందించిన చంద్రబాబు:విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. "ఆంధ్రప్రదేశ్​లో ఆకలి చావు!" అని రాసుకొచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated :Feb 10, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details