ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యానిది హత్యే: మంత్రి మేరుగ

By

Published : May 22, 2022, 8:16 PM IST

Updated : May 23, 2022, 6:46 AM IST

Minister Meruga on MLC issue: డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

సుబ్రహ్మణ్యం మృతిపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం -మంత్రి మేరుగ
సుబ్రహ్మణ్యం మృతిపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం -మంత్రి మేరుగ

సుబ్రహ్మణ్యం మృతిపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం -మంత్రి మేరుగ

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యానిది హత్యేనని, ఇందుకు పార్టీ నాయకులంతా చాలా బాధపడ్డారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆయన నగరంలోని వైకాపా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సుబ్రహ్మణ్యం మృతి విషయంలో ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తం చేస్తే కేసు నమోదు చేశాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. చిత్తశుద్ధితో కేసును విచారిస్తున్నాం. దళితులపై దాడి చేస్తే ఎంతటి వారినైనా శిక్షించి తీరుతాం. అనంతబాబు తప్పు చేస్తే కచ్చితంగా శిక్షపడుతుంది. ఘటన జరిగిన వెంటనే విషయం పక్కదారి పట్టకుండా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి మనోధైర్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఒకప్పుడు దళితులపై అఘాయిత్యాలు, దాడులు జరిగితే చంద్రబాబు ఏం చేశారు? దళితుల కుటుంబంలో పుట్టకూడదని చెప్పారు. అంబేడ్కర్‌ పేరు ఓ జిల్లాకు పెట్టిన ఘనత మాదే’ అని అన్నారు.

నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదు

రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 17 మందికి మంత్రి పదవులు ఇచ్చి సామాజిక సంస్కరణలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితుల గురించి ఆలోచించే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఆదివారం మధ్యాహ్నం విజయనగరంలోని జడ్పీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Last Updated :May 23, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details