ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KGBV Part Time PGTs Protest: 'ఇన్నేళ్లు పని చేయించుకుని తొలగించారు.. న్యాయం చేయండి'

By

Published : Jun 21, 2023, 8:19 PM IST

KGBV Part Time PGT Teachers: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్​ టైం పీజీటీలు, పీఆర్​టీల తొలగింపుపై ఆందోళన నిర్వహించారు. తమను నియమించుకునే సమయంలో తెలిపినట్లుగా.. ఏవి అమలు కావటం లేదని ఆరోపించారు. తమను విధుల్లోంచి తొలగించటం సరికాదని.. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సెలవులు అని కూడా చూడకుండా తమతో పని చేయించుకున్నారని వారు ఆవేదనకు లోనయ్యారు.

Etv Bharat
Etv Bharat

KGBV Part Time PGT Teachers Agitation: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పీఆర్​టీలు, పీజీటీలు ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా తమను తొలగించి కొత్తవారిని నియామించారని.. కర్నూలు కలెక్టర్​ కార్యాలయం ఎదుట కేజీబీవీ పార్ట్​ టైం మహిళ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమను పార్ట్​ టైం​ ఉద్యోగుల నుంచి కాంట్రాక్ట్​ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేశారు. తక్షణమే నూతన నియామకాలను నిలిపివేసి.. వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

శ్రీకాకుళంలో ధర్నా:ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కేజీబీవీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ.. శ్రీకాకుళం సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు కార్యాలయం ఎదుట పీఆర్​టీ, పీజీటీలు ధర్నా నిర్వహించారు. గత ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్యాయురాళ్లను తొలగించటంపై మండిపడ్డారు. దాదాపు 150 మందిని విధుల నుంచి తొలగించారని.. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన నియామకాలు నిలిపివేసి.. పాత వారినే కొనసాగించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్​లో.. తమకు 2మార్కులు చేరుస్తామని చెప్పారని వివరించారు. కానీ, ఇప్పుడు అర మార్కు మాత్రమే చేరుస్తున్నారని ఆరోపించారు.

కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తొలగింపుపై పార్ట్​టైం టీచర్ల ఆందోళన

"నేను 2016లో జాయిన్​ అయ్యాను. అప్పుడు ఆర్డర్​ కాపీ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్​ సమయంలో మాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు అర్ధంతారంగా ఆపేశారు." -రమణమ్మ, ఉపాద్యాయురాలు, కేజీబీవీ, భామిని.

"మమ్మల్ని తొలగించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారేమో అనిపిస్తోంది. మేము అన్యాయమైపోతున్నాము. మా మీద మా కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. మా ఆవేదన ఎక్కడ చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు." -సునీత, ఉపాద్యాయురాలు, కేజీబీవీ, సీతంపేట.

కర్నూలులో ఆందోళన:కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్​ టైం టీచర్లను తొలగించటం సరికాదని.. పార్ట్​ టైం పీజీటీలు కర్నూలు కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఐదు సంవత్సరాలుగా పార్ట్​ టైం టీచర్లుగా పనిచేస్తున్నారని.. ఇప్పుడు వారిని కాదని కొత్తవారిని నియామిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పార్ట్​ టైం టీచర్ల నుంచి కాంట్రాక్టు టీచర్లుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు.

అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఇలా చేయటం సరికాదని టీచర్లు ఆవేదనకు గురయ్యారు. ఇంగ్లీష్​, తెలుగు పీజీటీలకు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు. ఇన్ని రోజులు తమతో వెట్టి చాకిరి చేయించుకున్నారని.. సెలవుల్లో కూడా విధులు నిర్వహించినట్లు వివరించారు. తమపై తమ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. కర్నూలు జాయింట్​ కలెక్టర్​ మౌర్యకు వినతిపత్రాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details