KGBV Recruitment 2023 : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాయలాల్లో, అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో 1241 కాంట్రాక్ట్ మహిళా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
కేజీబీవీ పాఠశాలల్లో అధ్యాపకులుగా పనిచేయడానికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్బన్ రెసిడెన్సియల్ పోస్టులకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులే. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జులై నెలలోనే ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష కూడా నిర్వహించనున్నారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని పోస్టుల వివరాలు
- స్పెషల్ ఆఫీసర్ - 38
- పీజీసీఆర్టీ (ఆంగ్లం) - 110
- పీజీసీఆర్టీ (గణితం) -60
- పీజీసీఆర్టీ (నర్సింగ్) - 160
- పీజీసీఆర్టీ (తెలుగు) - 104
- పీజీసీఆర్టీ (ఉర్దూ) - 2
- పీజీసీఆర్టీ (వృక్షశాస్త్రం) - 55
- పీజీసీఆర్టీ (కెమిస్ట్రీ) - 69
- పీజీసీఆర్టీ (జంతుశాస్త్రం) - 54
- సీఆర్టీ (బయో సైన్స్) - 25
- సీఆర్టీ (ఆంగ్లం) - 52
- సీఆర్టీ (హిందీ) - 37
- సీఆర్టీ (గణితం) -45
- సీఆర్టీ (ఫిజికల్ సైన్స్) - 42
- సీఆర్టీ (సోషల్ స్టడీస్) - 26
- సీఆర్టీ (తెలుగు) - 27
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 77
నోట్: ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్ (యూఆర్ఎస్)లోని పోస్టుల వివరాలు
- స్పెషల్ ఆఫీసర్ - 4
- సీఆర్టీ (తెలుగు) - 5
- సీఆర్టీ (ఆంగ్లం) - 5
- సీఆర్టీ (సైన్స్) - 6
- సీఆర్టీ (సోషల్ స్టడీస్) - 3
నోట్ : ఈ పోస్టులకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులే.
- విద్యార్హతలు
అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ/ స్పెషల్ బీఈడీ/ యూజీపీఈడీ/ బీపీఎడ్ ఉత్తీర్ణతతో సహా టెట్/ సీటెట్లోనూ అర్హత సాధించి ఉండాలి. - వయోపరిమితి
2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో అభ్యర్థుల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఇచ్చారు. - ఫీజు వివరాలు
అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.600లు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
- స్పెషల్ ఆఫీసర్ : రాత పరీక్షకు 75 శాతం వెయిటేజీ, టెట్‌కు 20 శాతం వెయిటేజీ, పని అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
- పీజీజీఆర్టీ పోస్టులు: రాత పరీక్షకు 95 శాతం వెయిటేజీ, పని అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
- సీఆర్టీ పోస్టులు : రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
- పీఈటీ పోస్టులు : కేవలం రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.