ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మంత్రి వచ్చినపుడు చప్పట్లు కొట్టాలి, పూలు చల్లాలి'.. డ్వాక్రా మహిళలకు అధికారి హుకుం

By

Published : Jan 29, 2023, 4:24 PM IST

Government Employee Behaved Like Activist : శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అధికార పార్టీ కార్యకర్తల ప్రవర్తించాడు. మందస మండలంలో నిర్వహించనున్న గడపగడపకు కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు ఆ అధికారి జారీ చేసిన ఆదేశాలు చూసిన వారు.. ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Government Employee Behaved Like Activist
అధికార పార్టీ కార్యకర్తల ప్రభుత్వ ఉద్యోగి

Government Employee Behaved Like Activist : శ్రీకాకుళం జిల్లా మందస మండల ఏపీఎం ప్రసాదరావు.. మంత్రి అప్పలరాజుపై స్వామిభక్తిని చాటుకున్నాడు. తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి అనే మాట మరిచిపోయినట్టున్నారు. జగన్​, అప్పలరాజుపై ఏపీఎం చేసిన పొగడ్తల వర్షం.. స్థానిక మహిళలను ముక్కున వేలు వేసుకునేలా చేసింది. జిల్లుండ గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసం సన్నద్దం కావాలంటూ.. డిమిరియా గ్రామంలో శనివారం డ్వాక్రా మహిళలతో ఏపీఎం ప్రసాదరావు సమావేశమయ్యారు.

వైసీపీ కార్యకర్తల ప్రవర్తించిన ప్రభుత్వ అధికారి

మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మంత్రి వచ్చినప్పుడు ఇలా చేయండి.. అలా చేయండని సూచించారు. మంత్రి వస్తున్న కార్యక్రమానికి పట్టు చీరలు కట్టుకుని రావాలని ఆదేశించారు. మంత్రి రాగానే ఆయనపై పూలు చల్లాలని, నవ్వుతూ ఉండాలని వారికి సూచనలిచ్చారు. అంతేకాకుండా వారు సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు కూడా కొట్టాలని ఆదేశాలు చేశారు. ఇదంతా చూసిన సమావేశంలో కొందరు మాహిళలు, గ్రామస్థులు ఆయనపై విమర్శలు చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగా, వైసీపీ కార్యకర్తనా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details