ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంబులెన్సుల బిల్లులు ఎగవేత.. దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు

By

Published : Jan 19, 2023, 9:01 PM IST

Updated : Jan 19, 2023, 9:42 PM IST

Ambulance bills

Ambulance bills: కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో.. హిందూపురం తహసీల్దార్, ఆర్టీవో అధికారులు ప్రైవేట్ అంబులెన్స్​ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అధికారులు ప్రభుత్వం నుండి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని.. బిల్లులు వెంటనే మంజూరయ్యేలా చూస్తామని చెప్పి తమ సేవలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడేమో బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ప్రైవేట్ అంబులెన్స్​ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్సుల బిల్లులు ఎగవేత.. దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు

Ambulance bills: విపత్కర సమయంలో తమతో సేవలు చేయించుకొని రెండు సంవత్సరాలుగా బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రైవేట్ అంబులెన్సుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఇక తాము బిల్లులపై ఆశలు వదులుకున్నామని అసహనం వ్యక్తం చేశారు.

2020 సంవత్సరంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో హిందూపురం తహసీల్దార్, ఆర్టీవో అధికారులు ప్రైవేట్ అంబులెన్స్​ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అధికారులు ప్రభుత్వం నుండి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని... బిల్లులు వెంటనే మంజూరయ్యేలా చూస్తామని అంబులెన్స్ నిర్వాహకులకు చెప్పి వారి సేవలను వినియోగించుకున్నారు. అనంతరం వారికి రావాల్సిన 11 లక్షల బకాయిలలో కేవలం ఐదు లక్షలు చెల్లించి చేయి దులుపుకున్నారు.

2020లో కరోనా సమయంలో అంబులెన్సులు పెట్టాము. 11 లక్షల పైగా బిల్లు అయింది. ఐదు లక్షల 21వేల ఏడు వందలు ఇచ్చారు. ఇంకా ఆరు లక్షల 50 వేల 800 రూపాయలు రావాలి వాటి కోసం కార్యాలయాల కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము.- తౌసిఫ్, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు

2020లో కరోనా సమయంలో అంబులెన్సులు పెట్టాము. ఇంతవరకు బిల్స్​ కాలేదు.. జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంతో పాటు హిందూపురంలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి వాళ్లు మారుతున్నారు కానీ మా బిల్స్​ కావట్లేదు.- ఖాన్ అహమ్మద్, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు

ఆర్టీవో సర్​, ఎమ్మార్వో సర్​ చెప్పారు... మీరు అంబులెన్సులు పెట్టండి మీకు ఏ హాని వచ్చినా మేము చూసుకుంటాము అని చెప్పారు. కాని కరోనా అయిపోయాక మమ్మల్ని పట్టించుకునే వారే లేరు.. ఆర్టీవో మారిపోయారు, ఎమ్మార్వో మారిపోయారు.. జిల్లానే మారిపోయింది. ఏ ఆఫీస్​కి వెళ్లినా వస్తాయి అంటున్నారు కానీ రావడం లేదు. ఎవర్ని అడగాలి... ఏం చేయాలో అర్థం కావట్లేదు.- అంజాద్, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు

తమకు రావాల్సిన ఆరు లక్షల 50 వేల 800 రూపాయల బకాయిల కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాలతో పాటు... హిందూపురంలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని ఆంబులెన్స్ నిర్వాహకులు తెలిపారు. ఇక బిల్లులు రావని గాలికి వదిలేసామని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 19, 2023, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details