ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంకొల్లులో భారీగా గంజాయి పట్టివేత

By

Published : Aug 31, 2021, 6:20 PM IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 300 కిలోల గంజాయి, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

cannabis seized
గంజాయి పట్టివేత

ప్రకాశం జిల్లా ఎస్పీ ఎస్పీ మలిక గార్గ్ అదేశాల మేరకు ఇంకొల్లు పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంగవరం రోడ్డులో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అద్దంకికి చెందిన ఉప్పుతేర్ల మణికంఠ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన పొరళ్ల వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి కారు, ఆటో, 10 ఇనుప మంచాలు, పరుపులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి రూ.24 లక్షల వరకు విలువ చేస్తుందన్నారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ మలిక గార్గ్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details