ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జూన్ 26న ప్రతిష్టాత్మకంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ'

By

Published : Apr 3, 2022, 5:35 PM IST

రామోజీ ఫిలింసిటీలో జూన్ 26న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మహాసభ అధ్యక్షుడు టంగుటూరు రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ మహాసభకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు.

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభను జూన్ 26న రామోజీ ఫిలింసిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు మహాసభ అధ్యక్షుడు టంగుటూరు రామకృష్ణ ప్రకటించారు. నెల్లూరులో ఆర్యవైశ్య ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన సభ నిర్వహణపై చర్చించారు. ఈ మహాసభకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు హాజరుకానున్నట్లు రామకృష్ణ తెలిపారు. ప్రపంచ స్థాయిలో ఆర్యవైశ్య మహాసభ నిర్వహించడం ఇదే మొదటిసారన్న ఆయన.. ఈ సభలో అన్ని సమస్యలపైనా చర్చిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details