ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రయోగ వేదికపైకి పీఎస్​ఎల్​వీ వాహన నౌక

By

Published : Nov 24, 2019, 5:45 AM IST

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి 47 సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్​లోని రెండో ప్రయోగ వేదికకు చేరింది. వివిధ పరీక్షలు చేసి ఈ నెల 27న దీనిని నింగిలోకి పంపనున్నారు.

ప్రయోగ వేదికపైకి పీఎస్​ఎల్​వీ వాహన నౌక

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్​లోని రెండో ప్రయోగ వేదికకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి 47 చేరింది. ఇక్కడ వివిధ పరీక్షలు చేసి ఈ నెల 27న ఉదయం 9 గంటల 28 నిమిషాలకు దీనిని నింగిలోకి పంపనున్నారు. ఈ వాహన నౌక హై రిజల్యూషన్ చిత్రాలు తీసే సామర్థ్యం గల మూడో తరానికి చెందిన అధునాతన కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు, అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా యూఎస్​కు చెందిన 13 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు సోమవారం జరగనున్నాయి.

paper


Conclusion:

ABOUT THE AUTHOR

...view details