ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి

By

Published : Nov 2, 2020, 6:08 PM IST

ఆ ఊరి చెరువులో కొందరు ఇష్టానుసారంగా గుంతలు తవ్వారు. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణం బలిగొంది. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను మిగిల్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏ.ఎస్ పేట మండలంలో జరిగింది.

The boy accidentally fell into a pond and died in nellore
ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి

నెల్లూరు జిల్లా ఏ.ఎస్ పేట మండలం శ్రీ కొలనులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి మనీషారెడ్డి(11) అనే బాలుడు మృతి చెందాడు. చెరువులో ఇష్టానుసారంగా మట్టి కోసం గుంతలు తవ్వడం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details