ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Lokesh Condemned Attack on RTC Bus Driver in Kavali: వైసీపీ నేత‌లు గూండాల కంటే ఘోరంగా దాడిచేశారు.. హారన్‌ కొట్టడమే ఆర్టీసీ డ్రైవర్‌ నేరమా: లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 9:52 AM IST

Nara Lokesh Condemned Attack on RTC Bus Driver in Kavali: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని నారా లోకేశ్ ఖండించారు. హారన్‌ కొట్టారని డ్రైవర్‌పై జగన్‌ సైకో ఫ్యాన్స్‌ హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. హారన్‌ కొట్టడమే ఆర్టీసీ డ్రైవర్‌ బీఆర్‌.సింగ్‌ నేరమా.. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ తీయమని చెప్పడం తప్పా అంటూ ధ్వజమెత్తారు. న‌డిరోడ్డుపై వైసీపీ నేత‌లు గూండాల కంటే ఘోరంగా దాడిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh Condemned Attack on RTC Bus Driver in Kavali
Nara Lokesh Condemned Attack on RTC Bus Driver in Kavali

Attack on RTC Bus Driver in Kavali : బైక్‌ తీయాలని హారన్‌ మోగించిన ఆర్‌టీసీ డ్రైవరుపై దాడి

Nara Lokesh Condemned Attack on RTC Bus Driver in Kavali: ఆంధ్రప్రదేశ్‌.. సైకో జగన్‌ ఫ్యాక్షన్‌ ప్రదేశ్‌గా మారిపోయిందని లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సైకో జ‌గ‌న్ పోతేనే.. ఇలాంటి పిల్ల సైకో గ్యాంగుల‌న్నీ పోతాయంటూ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. హారన్‌ కొట్టడమే ఆర్టీసీ డ్రైవర్‌ తప్పా అని నిలదీశారు.

YSRCP Followers Attacked RTC Bus Driver in Kavali:బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంకురోడ్డు మీదుగా వెళుతున్నప్పుడు ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డుగా ఉండటంతో బస్సు డ్రైవరు బీఆర్ సింగ్‌ హారన్‌ మోగించారు. దాంతో ఆ వాహనదారుడు డ్రైవరుతో వాదనకు దిగాడు. ఆ సమయంలో వెనుకవైపు ఆగిన వాహనాలు హారన్‌ మోగించడం, అక్కడే ఉన్న ఒకటో పట్టణ పోలీసులు స్పందించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

తర్వాత తన స్నేహితులైన దేవరకొండ సుధీర్‌ తదితరులకు సెల్‌ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. మొత్తం 14 మంది కారులో వచ్చి ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవరును కిందకి దించి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక్కడే చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తామంటూ బెదిరింపులకు తెగబడ్డారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై డ్రైవరు కిందపడినా.. వదిలిపెట్టలేదు. ఆ దారుణ ఘటనను వీడియో తీస్తున్న వారి ఫోన్లనూ లాక్కున్నారు.

Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్​ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్​పై దాడి..!

సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో దేవరకొండ సుధీర్‌, శివారెడ్డి, విల్సన్‌, మల్లి, కిరణ్‌లతో పాటు మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ చెప్పారు. డ్రైవరుపై దాడి చేసిన నిందితులపై ఇప్పటికే నేరారోపణలు ఉన్నాయని.. సస్పెక్ట్‌ షీట్‌ తెరిచి ఉందని అన్నారు.

కావలి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెంగళరావునగర్‌లో వీరు ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదరరావు, నరసయ్య హెచ్చరించారు.

YCP Leaders Attacked Businessman: పల్నాడు జిల్లాలో వైసీపీ 'గాడ్సే'లు.. కంపెనీ పెట్టిన ఎన్​ఆర్​ఐకి తీవ్ర ఇబ్బందులు.. కిడ్నాప్​కు యత్నం

RTC Bus Driver About Attack:విచక్షణరహిత దాడిపై ఆర్టీసీ డ్రైవర్‌ సింగ్‌.. కన్నీటి పర్యంతమయ్యారు. ఓ దశలో తాను చనిపోయానని భావించానన్న ఆయన.. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాడికి పాల్పడింది స్థానిక వైసీపీ నేతలన్న ఆయన.. వారికి శిక్షపడే వరకూ పోరాటం చేస్తానని స్పష్టంచేశారు. అడ్డు తప్పుకోవాలని కేవలం బస్సు హారన్ మోగించినందుకు తనపై వైసీపీ నేత, ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు.

RTC Bus Driver About Attack: విచక్షణారహిత దాడిపై ఆర్టీసీ డ్రైవర్‌ సింగ్‌ కన్నీటి పర్యంతం

కావలి శివారు ప్రాంతం వరకు బస్సును ఫాలో అయి 14 మంది మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. బస్సులోని ప్రయాణికులు, సహ డ్రైవర్ వచ్చి కాపాడారని, ఆ ప్రయత్నంలో వారిపైనా వారు దాడి చేసినట్లు పేర్కొన్నారు. దాడి దృశ్యాలను చిత్రీకరిస్తోన్న ప్రయాణికులు, డ్రైవర్ పైనా దారుణంగా దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కావలి స్థానిక కార్పోరేటర్ ఉన్నట్లు తనకు స్థానికులు తెలిపారని బాధిత డ్రైవర్ తెలిపారు.

తనపై దాడి చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలా ఆర్టీసీ డ్రైవర్లపై అకారణంగా విచక్షణా రహితంగా మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనను తన 50 ఏళ్ల సర్వీసులో చూడలేదన్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కరవైందని, యూనియన్లను రద్దు చేసి ఐక్యత లేకుండా చేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని బాధిత డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన నేతలు, అనుచరుల ఫొటోలు, ఆధారాలు తనవద్ద ఉన్నాయని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం సైతం తనకు అండగా నిలవాలని డ్రైవర్‌ సింగ్‌ కోరుతున్నారు.

YCP Leaders Attack on SCs in Annamayya District: అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఎస్సీలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి

ABOUT THE AUTHOR

...view details