ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అసెంబ్లీ అలా కాదు.. ఇలా ఉండాలి'.. మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

By

Published : Mar 16, 2023, 3:11 PM IST

Updated : Mar 16, 2023, 6:39 PM IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

MLA Kotamreddy Sridhar Reddy Mock Assembly : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. తన నియోజకవర్గంలో సమస్యలపై కోటంరెడ్డి.. అసెంబ్లీలో నిరసన తెలిపారు. సుమారు నాలుగు గంటలు నిలబడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంతో.. అందుకు నిరసనగా నెల్లూరులో మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

MLA Kotamreddy Sridhar Reddy Mock Assembly : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తన కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. తన నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోటంరెడ్డి నిన్న అసెంబ్లీలో నిరసన తెలిపారు. ప్లకార్డుతో పాదయాత్రగా వెళ్లి.. అసెంబ్లీలో నాలుగు గంటలు నిలబడ్డారు. కాగా, సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయగా.. అందుకు నిరసనగా నెల్లూరులో మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నిరంకుశంగా అసెంబ్లీ నిర్వహణ.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తన కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రకటించారు. అసెంబ్లీ నిర్వహణ నిరంకుశంగా ఉందని విమర్శించారు. సమస్యలు అడిగితే.. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..? అని స్పీకర్​ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చూపిస్తూ అసెంబ్లీలోకి వెళ్తే.. గేట్​లోనే ఆపారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వ లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడితే గేట్​లో నుంచి మార్షల్ చేత నెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాక్ అసెంబ్లీ ద్వారా స్పీకర్​కు సమస్యలు వివరించారు.

ముఖ్యమంత్రి హామీలు నెరవేరడం లేదని.. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీలు సరిగా లేవని సభ దృష్టికి తీసుకెళ్లారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మిస్తామని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నెరవేర లేదని గుర్తు చేశారు. ములుముడు వంతెన రోడ్లకు రూ.28కోట్లు ఇస్తామని చెప్పిన మాటలు కార్యరూపం దాల్చలేదని అన్నారు. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగాను... కాంట్రాక్టర్ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ, ఇంత వరకూ బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మరపూడి రైతుల పరిహారం ఇవ్వాలని 50సార్లు అడిగినా ఫలితం లేదు.. అని మాక్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని, వాటిపై అసెంబ్లీ వేదికగా హామీ ఇవ్వాలని నేను అడిగితే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు బాధాకరం. నేను ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల్ని ఎత్తిచూపుతూ ప్లకార్డు ప్రదర్శిస్తే.. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసుల లాక్కున్నారు. అధ్యక్షా మైక్ ఇవ్వండి అని సభలో అడిగితే.. ఆ అవకాశం కల్పించలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు నాకు నాలుగు నిమిషాలు అవకాశం ఇవ్వలేదు కానీ... నన్ను తిట్టడానికి మంత్రులకు సుమారు 40 నిమిషాలు అవకాశం కల్పించారు. మైక్ ఇచ్చేందుకు నేనే.. దాదాపు నాలుగు గంటల పాటు నిలబడి నిరసన తెలిపాను. - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఇవీ చదవండి :

Last Updated :Mar 16, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details