ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Dharmana Directions to Volunteers: 'వైసీపీ ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో పనిచేయాలి'..వాలంటీర్లకు మంత్రి ధర్మాన దిశానిర్దేశం

By

Published : Aug 11, 2023, 8:22 AM IST

Minister Dharmana Directions to Volunteers: వైసీపీ గెలుపునకు వాలంటీర్లు బాటలు వేయాలంటూ ఆ పార్టీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.

Minister Dharmana_Meeting_With_Volunteers
Minister_Dharmana_Directions_to_Volunteers_in_Internal_Meeting

Minister Dharmana Directions to Volunteers: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు వాలంటీర్లు బాటలు వేయాలంటూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మార్గదర్శనం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గురువారం వాలంటీర్లు, గృహసారథులు, వైసీపీ నాయకులు, MLA మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి మంత్రి ధర్మాన అంతర్గత సమావేశం నిర్వహించారు. వాలంటీర్లు, నాయకులంతా ఫోన్‌లు స్విచ్ఛాప్‌ చేసి.. తలుపులు వేసి.. మీడియాకు ప్రవేశం లేకుండా చేసి చర్చించారు.

Dharmana Comments on Infrastructure : రోడ్లు వేయడం ఒక్కటే అభివృద్ధి కాదు : మంత్రి ధర్మాన

Minister Dharmana Meeting With Volunteers: విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉద్యోగాలిచ్చాం.. గౌరవమైన గుర్తింపు తెచ్చామని సమావేశంలో వాలంటీర్లతో మంత్రి ధర్మాన అన్నట్లు సమాచారం. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వాలంటీర్లు సహకరించాల్సిన అవసరం ఉందని ధర్మాన కోరినట్లు తెలిసింది. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తగిన ప్రతిఫలం అందేలా చూస్తారని చెప్పినట్లు సమాచారం. మీరు చేయాల్సిన పనల్లా ఒకటే.. ఆరు నెలల వ్యవధిలో ఇంటింటికీ వెళ్లండి.. ఆయా కుటుంబసభ్యుల మనోభావాలు తెలుసుకోండని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. మనకు ఓటేసే వారేనా.. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నారా.. అనే జాబితా సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. అది పార్టీ నాయకులకు అందజేస్తే.. మేము వాటిని పైవాళ్లకు పంపుతామని.. వారంతా చేయాల్సింది చేస్తారన్నారు. మీ పనితీరుపై పార్టీ నాయకులు, గృహసారథులతో నిఘా ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Minister Dharmana జగనన్న ఇస్తున్న పథకాలు అన్నీ ఆగిపోతాయి.. మీకు విజ్ఞత ఉండాలి! : మంత్రి ధర్మాన

Minister Dharmana Issued Dotted Lands to Farmers: అంతకుముందు రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్ని.. చుక్కల భూముల రైతులకు పట్టాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేయలేని భూ సమస్యలను వైసీపీ ప్రభుత్వం చేపడుతూ ఉంటే.. జగన్ మోహన్ రెడ్డిని పిచ్చోడు అని విమర్శించడం సరికాదని మంత్రి ధర్మాన అన్నారు. పేద రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను 20 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు వైసీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా వెసులుబాటును కూడా త్వరలో కల్పిస్తామని ఆయన తెలిపారు.

Shock to Minister Dharmana: ధర్మానకు 'సైకిల్'​ ఝలక్​.. మహిళ రాక్​.. మంత్రి షాక్​..!

Protest to Minister Dharmana in Revenue Meeting: కాగా, రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది. రెవెన్యూ సదస్సు ప్రారంభమైన వెంటనే మంత్రి ధర్మాన మాట్లాడుతుండగా బోయిల్లా చిరివెళ్ల గ్రామానికి చెందిన ఏసుబాబు రామకృష్ణ తన సమస్యను చెప్పుకోబోయాడు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు.. రామకృష్ణను బయటకు గెంటేసారు. రామకృష్ణను.. పోలీసులు బయటకు గెంటేస్తున్న మంత్రి ధర్మాన చూసిచూడనట్లు వ్యవహరించారు. తన భూమిని వైసీపీ నేత యాదాది రెడ్డి ఆక్రమించాడని రైతు రామకృష్ణ ఆరోపించారు. నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను మంత్రికి చెప్పుకుందామని వచ్చిన చెప్పుకునే అవకాశం కల్పించలేదని ఆందోళన చెందారు. తన గోడును మీడియా ముందు చెప్పుకొని.. న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

ధర్మాన సభలో మహిళలకు తప్పని పాట్లు.. బయటికి రాలేక.. లోపలికి వెళ్లలేక..!

ABOUT THE AUTHOR

...view details