ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధైర్యం ఉంటే చంద్రబాబు 175 స్థానాల్లో పోటీకి రావాలి: కాకాణి గోవర్ధన్ రెడ్డి

By

Published : Apr 7, 2023, 9:48 PM IST

Kakani comments on Chandrababu: తెలుగుదేశం హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. దానికి సమాదానంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ధైర్యం ఉంటే చంద్రబాబు 175 స్థానాల్లో పోటీకి రావాలని.. సవాల్‌ విసిరారు. నెల్లూరులో చంద్రబాబు చేసిన విమర్శలపై ఎదురు దాడి చేశారు

Kakani comments on Chandrababu
Kakani comments on Chandrababu

Kakani comments on Chandrababu: తెలుగుదేశం పార్టీ హయాంలో నెల్లూరు జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జోన్-4 సమావేశంలో చంద్రబాబు చేసిన విమర్శలపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా జిల్లాకు ఏమి చేయని చంద్రబాబు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసి పెట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. టిడ్కో ఇళ్లు కట్టిన చంద్రబాబు అధికారంలో ఉండగా లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఇల్లు ఇస్తున్నామో తెలుసుకోవాలన్నారు. అధికారంలోకి రాకముందే సమస్యల పరిష్కారానికి కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాననడం అవివేకమన్నారు. ముఖ్యమంత్రి జగన్ వైనాట్ 175 అంటుంటే, చంద్రబాబు మాత్రం వైనాట్ పులివెందుల అని అంటున్నారంటే తెలుగుదేశం పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. అసలు 175 స్థానాల్లో పోటీ చేస్తామని చేప్పే దమ్ము చంద్రబాబుకు ఉందాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పేరు ఎత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు.

చంద్రబాబు చేసిన సవాల్​.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో తెలుగుదేశం హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు.. ఇవే తమ ప్రభుత్వ హయాంలో పేదల కోసం నాడు కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు చూడు.. జగన్ అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లెన్ని.. అవి ఎక్కడ.. జవాబు చెప్పగలవా అంటూ నిలదీశారు. జగన్​కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోలతో చంద్రబాబు ట్వీట్ చేశారు. తన మొబైల్ ఫోన్​తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగి సవాల్ విసిరారు. జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్​కు, నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ మౌలికసదుపాయల కల్పన సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో 94 పురపాలక సంఘాల్లో నివాస సముదాయాలను నిర్మించారు. గూడు లేని పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరాలని ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం వీటికి శంకుస్థాపన చేసింది. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తైన ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పేదలకు అందించడంలో విఫలమైంది. అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న ప్రజలు వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details