ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్యాన్సర్​తో మా నాన్న అవస్థ పడుతున్నాడు.. దాతలేవరైనా ఉంటే బతికించడి ప్లీజ్​..

By

Published : Jan 10, 2023, 1:05 PM IST

Updated : Jan 10, 2023, 1:59 PM IST

Waiting For Financial Support : నెల్లూరు జిల్లాలో అల్లాబక్షు అనే వ్యక్తి క్యాన్సర్​తో బాధ పడుతున్నాడు. అతని భార్యకు కడుపులో కణితికి చికిత్స తీసుకుని మందులు వాడుతోంది. వారికి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడాని కుటుంబం వారిది. తల్లిదండ్రులకు వచ్చిన అనారోగ్య స్థితిని చూసి తమ తల్లిదండ్రులను కాపాడమని చిన్నారులు వేడుకుంటున్నారు. తమ తల్లిదండ్రులను బతికించమని చిన్నారులు ప్రాదేయపడటం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

waiting for financial assistance in atmakur
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు

Waiting For Financial Support : నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన అల్లాబక్షు చికెన్​ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య షకీరా, ఇద్దరు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. వారు ఆత్మకూరులో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అల్లాబక్షు స్థానికంగా మాంసం దుకాణంలో పనిచేస్తూంటే.. అతనికి వచ్చే కొద్దిపాటి మొత్తంతో వారి జీవితం సాఫీగా సాగిపోయింది. ఏ ఇబ్బందులు లేకుండా వచ్చిన కొద్ది మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటూ జీవించసాగారు. అంతలోనే వారి కుటుంబంలోకి క్యాన్సర్​, కడుపులో కణితి, ఫిట్స్​ వ్యాధులనే కష్టాలు వచ్చి చేరాయి.

మూడు నెలల క్రితం అల్లాబక్షుకి చిన్న గడ్డ ఏర్పడి చీము, రక్తం కారసాగింది. వెంటనే నెల్లూరు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. వైద్యులు ఆపరేషన్​ చేసి గడ్డను తొలగించారు. కొన్ని రోజులు బాగానే ఉన్న ఆ గడ్డ దగ్గర చీము, రక్తం రావటం ప్రారంభించింది. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి క్యాన్సర్​ అని తెలింది. అల్లాబక్షుకు క్యాన్సర్​ మొదటి దశలోనే ఉందని.. వైద్య చికిత్స అందిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను క్యాన్సర్​కు మందులు వాడుతున్నాడు. మొదట్లో భార్య కూలి పనులు చేస్తూ మందులకు డబ్బులు సంపాదించేది. ఆమెకు కడుపులో కణితి ఏర్పడింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్​ చేశారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటోంది. దంపతులిద్దరూ ఆనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో వారికి పూట గడవటం కష్టంగా మారింది. ఇరుగు పోరుగు వారు అందించే సహాయంతో మందులు తెచ్చుకోలేక, ఇంటి అద్దే కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

మూలిగే నక్కపై తాటి పండు పడింది అన్నట్లు తయారైంది వారి కుటుంబ పరిస్థితి. ముగ్గురు చిన్నారులలో బాలుడి పేరు అఫ్జల్. ఇతను ఫిట్స్ వ్యాధి తో బాధపడుతున్నాడు. అతనికి వైద్య ఖర్చులకు నగదు కావాలని షకీరా అంటోంది. ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం చుట్టు పక్కల వారు అందించే ఆర్థిక సహాయం మందుల ఖర్చులకు సరిపోతుందంటోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే భర్తకు మెరుగైన చికిత్స ఇప్పించి బతికించుకుంటానని వేడుకుంటోంది. తమ తల్లిదండ్రులను బతికించమని ముగ్గురు చిన్నారులు ప్రాదేయపడుతున్నారు. దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే.. వారి కుటుంబం కుదుట పడుతుందని స్థానికులు అంటున్నారు.

"నా భర్త చికెన్​ సెంటర్​లో పనిచేస్తాడు. అతను పని చేసి తీసుకువస్తేనే మా కుటుంబం గడుస్తుంది. మేము ఉండేది అద్దె ఇల్లు. మందులకు డబ్బులు లేవు. ఇల్లు గడవటానికి కష్టంగా ఉంది. దాతలేవరైనా ఉంటే దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి." - షకీరా, బాధితుడి భార్య

దాతలేవరైనా ఉంటే మా నాన్నను బతికించడి ప్లీజ్​..

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details