బాధితురాలి అభ్యర్ధనతో.. అత్యాచార ఘటన కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

author img

By

Published : Jan 10, 2023, 9:35 AM IST

Andhra Pradesh High Court

Rape Case : బాధితురాలి అభ్యర్ధన మేరకు.. అత్యాచార కేసు నిందితుడిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు కోట్టివేసింది. ఈ కేసులో తాను రాజీపడతాననని, సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకుంటామన్న.. ఫిర్యాదుదారు అభ్యర్ధనను హైకోర్టు అంగీకరించింది. గతంలో ఇలాంటి ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుంటూ.. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

Gajuwaka Rape Case : తనతో ఉన్న శారీరక సంబధాన్ని కాదని.. మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ఓ యువతి ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు.. మోసం, అత్యాచారానికి పాల్పడ్డాడని యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఆ యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్​ దాఖాలు చేశాడు. ఇదే కేసులో ఫిర్యాదు చేసిన యువతీ కేసును రాజీకి కుదుర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని అనుబంధ పిటిషన్​ను దాఖాలు చేసింది. కోపం నిరాశతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అనుబంధ పిటిషన్​లో​ తెలిపింది. ఎవరి జీవితాన్ని వారు సజావుగా గడిపేందుకు, సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకున్నామని.. రాజీకి అనుతినివ్వాలని యువతి కోర్టును కోరింది.

ఈ వాజ్యం పై విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ ఆర్​ రఘునందన్​రావు రాజీకి అనుమతినిచ్చారు. గతంలో కే దండపాణి కేసులో హత్యచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసులో రాజీకీ సుప్రీం అనుమతినిచ్చిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. కర్ణాటక హైకోర్టు 2022లో.. కేసును కొట్టివేయడం ద్వారా నిందితుడు, ఫిర్యాదురాలు కలిసి కుటుంబ జీవనం సాగించేందుకు వీలున్నా.. నిర్దిష్ట పరిస్థితుల్లో అత్యాచారం కేసులో రాజీ పడేందుకు వీలు కల్పించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఇరువురూ రాజీ పడేందుకు కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఫిర్యాదురాలిని ప్రశ్నించగా.. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ .. ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు, కేసును రాజీ చేసుకునేందుకు అసక్తిగా ఉన్నానని ఆ యువతి తెలిపింది. కోపం నిరాశతో పోలీసులకు ఫిర్యాదు చేశానని న్యాయమూర్తికి వివరించింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసు ఉపసంహరణకు అనుమతినిచ్చారు. దీంతో యువతి అనుమతి మేరకు పోలీసులు యువకుడిపై నమోదైన కేసును కొట్టివేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.