ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేటి నుంచి రెండురోజుల పాటు చంద్రబాబు నెల్లూరు పర్యటన

By

Published : Oct 13, 2019, 9:09 PM IST

Updated : Oct 14, 2019, 2:31 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం నుంచి రెండురోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటన సాగుతుందని పార్టీ సీనియర్​ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

బాబు

'నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీల్లో చంద్రబాబు పర్యటన'

తెదేపా అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు నెల్లూరులో పర్యటిస్తారని ఆ పార్టీ సీనియర్​ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయటం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే ధ్యేయంగా ఆయన సమావేశాలు నిర్వహిస్తారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తెదేపా అధినేత తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని సోమిరెడ్డి తెలిపారు.

పర్యటన ఇలా...
సోమవారం ఉదయం 11గంటలకు చంద్రబాబు పట్టణంలోని అనిల్ గార్డెన్స్​కు చేరుకుంటారు. అక్కడ పార్టీ జిల్లా సర్వసభ్యసమావేశం అనంతరం మధ్యాహ్నం నుంచి ఆరు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో వైకాపా అనుసరిస్తోన్న విధానాలపై 15వ తేదీన చర్చిస్తారు. తెదేపా కార్యకర్తలపై జరుగుతోన్న దాడులు, బాధితులతో మాట్లాడతారు. అనంతరం మిగిలిన నాలుగు నియోజకవర్గాల నేతలు సమీక్షల్లో పాల్గొంటారు.

sample description
Last Updated :Oct 14, 2019, 2:31 AM IST

ABOUT THE AUTHOR

...view details