ఆంధ్రప్రదేశ్

andhra pradesh

16 లక్షల రేషన్ కార్డులను తొలగించారు.. అరాచక వైసీపీని గద్దెదింపే వరకూ పోరాటం : చంద్రబాబు

By

Published : Dec 29, 2022, 10:44 PM IST

Updated : Dec 30, 2022, 2:13 PM IST

CBN Fires On CM Jagan: వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలంతా కలసి పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అప్పులతో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. తెదేపా సభలకు వస్తున్న స్పందనకు భయపడే అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పలికేందుకు ఇంటికొకరు తెదేపా జెండా పట్టుకుని రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Chandrababu
చంద్రబాబు

2019 నాటికి 3.62 లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడున్నరేళ్ళలోనే జగన్‌ 6.37 లక్షల కోట్ల అప్పు చేశారు
కందుకూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్ని గురువారం పరామర్శించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాత్రి కావలిలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సీఎం జగన్‌ను అప్పుల అప్పారావు అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించి 18 మంది ముఖ్యమంత్రులు 2019 నాటికి 3.62 లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడున్నరేళ్ళలోనే జగన్‌ 6.37 లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వజమెత్తారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తున్నారని మండిపడ్డారు.

భార్యాభర్తల మధ్య అగ్గి రాజేస్తున్నారు
దేశంలోని అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు 310 కోట్ల రూపాయలైతే ఒక్క సీఎం జగన్‌ ఆదాయం మాత్రం 375 కోట్లు రూపాయలని ఓ సర్వేలో తేలిందని చంద్రబాబు ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఓటును 10వేలు, 20వేలు వరకు కొనుగోలు చేయటంతో పాటు నాయకులను కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 16లక్షల రేషన్ కార్డులను తొలగించటంతో పాటు మహిళా పోలీసులతో అడగరాని ప్రశ్నలు ఆడిగిస్తూ భార్యాభర్తల మధ్య అగ్గి రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఐజీ చేసిన వ్యాఖ్యలపై

పోలీసులు చెప్పిన స్థలంలో కందుకూరు సభ నిర్వహించలేదంటూ డీఐజీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టిన ఏ అధికారిని వదిలేదని హెచ్చరించారు.

సంతాపం తెలిపే తీరిక లేని సీఎం

మృతి చెందిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కనీసం సంతాపం తెలిపే తీరిక లేని సీఎం ప్రధాని స్పందన చూసి స్పందించాడని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంటే జగన్ మాత్రం మూడు ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని ఎప్పటికీ పూర్తి చేయగలరో చెప్పగలరా అని ప్రశ్నించారు.

16 లక్షల రేషన్ కార్డులను తొలగించారు.. అరాచక వైసీపీని గద్దెదింపే వరకూ పోరాటం : చంద్రబాబు

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details